రామకృష్ణ.. ఈ హీరో గురించి ప్రస్తుత జనరేషన్ కి తెలియకపోయినా ఇంతకు ముందు తరం వారికి ఈ హీరో సుపరిచితమే. ఈయన అనేక తెలుగు సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన మొదటి సినిమా పెళ్ళికాని పిల్లలు అది 1961 సంవత్సరంలో విడుదల అయింది. నిజానికి రామకృష్ణ భీమవరం కి చెందిన వాడు. అతడు మొదటగా పెళ్లి చేసుకొని ఒక కూతురు పుట్టాక వారిద్దరినీ వదిలేసి చెన్నైకి సినిమాలలో నటించడానికి వెళ్ళిపోయాడు. ఒకవైపు సినిమా ప్రయత్నాల్లో ఉన్న రామకృష్ణ పూర్తిగా అతని భార్య, కూతురు ని మర్చిపోయి వారిని వదిలేశాడు. నిజానికి హీరో రామకృష్ణ మొదట్లో జాకెట్లు కుట్టుకునే జీవనం కొనసాగించేవారు. రామకృష్ణ అలా విడిచి వెళ్లి పోయాక తన భార్య, పిల్లలు కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగించడం జరిగింది.
హీరో రామకృష్ణ చెన్నై లో స్థిరపడిన తర్వాత ఒక ఇల్లు కొనడం జరిగింది. అయితే విజయవాడ నుంచి వచ్చిన శోభ అనే అమ్మాయి చెన్నైలో సినిమాల్లో నటించడానికి వచ్చింది. అయితే ఇలా సినిమాల్లో పరిచయమైన శోభ, హీరో రామకృష్ణ తో పరిచయం ఏర్పడి అది కాస్త పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న వారు చెన్నైలోని టీ నగర్లో హీరో రామకృష్ణ సొంత ఇంట్లో కాపురం కొనసాగించారు. ఇక అలా జీవితం కొనసాగుతుండగా ఆ ఇంటి పై భాగాన్ని ఒక తమిళ వ్యక్తికి బాడుగకు ఇవ్వడం జరిగింది. అయితే హీరో రామకృష్ణ చేసిన తప్పేంటి అంటే ఆ ఇంటిని శోభకు రాసి ఇవ్వడం. కొన్ని రోజులు గడిచాక పైన ఇంట్లో ఉంటున్న తమిళ వ్యక్తితో శోభ ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం లాంటివి చేయడంతో రోజు గొడవలు జరిగి చివరికి వారి గొడవలు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి.
అయితే ఒకానొక సమయంలో తను రాసిచ్చిన ఇంటిని తిరిగి నాకు రాసి ఇవ్వమని హీరో రామ కృష్ణ. అయితే దానికి శోభ ఒకసారి రాసి ఇచ్చాక మళ్ళీ ఎలా తిరిగి ఇస్తారు అని అనేకసార్లు గొడవ పడ్డారు. చివరికి ఈ విషయం మీద పోలీస్ స్టేషన్ లో కూడా విచారణ సాగగా… అక్కడ పోలీసులు మీరు రాసి ఇచ్చిన ఇంటిని మరి ఇలా వెనక్కి తీసుకోవడం కుదరదు అని తెలియజేశారు. కాబట్టి మీరు ఆ ఇంటి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు తెలియజేయడంతో ఆయన కొన్నాళ్లు బయట హోటల్లోనే జీవనం కొనసాగించాడు. ఇక ఆ తర్వాత వారు శోభ, హీరో రామకృష్ణ ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం శోభ కూడా కేన్సర్ వ్యాధితో మరణించింది. ప్రస్తుతం ఆ ఇంటికి ఓనర్ ఆ తమిళ వ్యక్తి. ఆయనకు ఇప్పటికి 95 ఏళ్లు. ఆయన ఇంకా బతికే ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…