Categories: FeaturedGeneral News

Dinesh Karthik : భార్య, స్నేహితుడు కలిసి మోసం చేస్తే.. జీవితం అంటే ఏంటో జనాలకు చెప్పిన క్రికెటర్ దినేష్ కార్తిక్.. పడిలేచిన కెరటం దినేష్ కార్తిక్..

Dinesh Karthik : జీవితంలో మనకు తెలిసో తెలియకో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అయితే కొన్ని వాటిలో మన ప్రమేయం ఉంటుంది. కానీ కొన్నింటిలో మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి. వీటి వలన ఒక్కోసారి జీవితం అతఃపాతాళానికి పడిపోతుంది. కానీ పడిపోయిన ప్రతి ఒక్కరూ అందులోనే ఉండిపోతే ఈ ప్రపంచం ఎందరో ఛాంపియన్స్ ను, విన్నర్ ను మిస్ అయి ఉండేది. అందుకే లైఫ్ అన్నాక సమస్యలు సహజం.. అందుకే తిరిగి ఆ సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నించాలి. అలా మనకు బాగా ఫేమస్ అయిన ఇండియన్ క్రికెటర్ కీపర్ బ్యాట్స్మన్ దినేష్ కార్తీక్ తన జీవితంలో అనుభవించిన దారుణమైన వైఫల్యం ఏమిటి ? ఎలా అతను వాటిని ఎదుర్కొని మళ్లీ సక్సెస్ బాట పట్టాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడుకు చెందిన క్రికెటర్ కీపర్ బ్యాట్స్మన్ దినేష్ కార్తిక్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇతని వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదం గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. దినేష్ కార్తిక్ 2004 లో ఇండియన్ ఆటగాడిగా ఆరంగేట్రం చేశాడు. తనదైన ఆటతీరుతో అందరి మనసులను గెలుచుకున్నాడు. అంతే కాకుండా తమిళనాడు స్టేట్ టీమ్ కి సైతం కెప్టెన్ గా నియమించబడ్డాడు. అప్పుడే దినేష్ కార్తిక్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన నికితా వంజారావు ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న సమయంలో ఊహించని పరిణామాలు జరగడం స్టార్ అయ్యాయి. దినేష్ కార్తిక్ కి తమిళనాడు కే చెందిన మరొక క్రికెటర్ మురళి విజయ్ మంచి స్నేహితుడు. ఇతను తరచూ దినేష్ కార్తిక్ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అలా దినేష్ కార్తిక్ భార్యతో పరిచయం అయింది. అయితే నికితాకు మురళి విజయ్ బాగా నచ్చాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమ కలిగేలా చేసింది. కానీ వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ విషయాన్ని దినేష్ కార్తిక్ పసిగట్టలేకపోయాడు. మురళి విజయ్ నికితాలు అందరికీ తెలిసే బయట సన్నిహితంగా ఉండడం మొదలు పెట్టారు.

అప్పట్లో తమిళనాడు క్రికెట్ టీమ్ లో అందరికీ ఈ విషయం తెలిసింది. కానీ దినేష్ కార్తిక్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అయితే 2012 లో అనిత మురళి విజయ్ వలన గర్బవతి అయింది. అప్పుడు దినేష్ కార్తిక్ కళ్ళు తెరిచాడు. ఈ గర్భానికి కారణం నేను కాదు..అంటూ గొడవకు దిగాడు. ఈ గొడవ వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం అయింది. అయితే ఈమె విడాకులు తీసుకున్న మరుసటి రోజే మురళి విజయ్ ను పెళ్లి చేసుకుంది. ఈ సంఘటనను దినేష్ కార్తిక్ తట్టుకోలేకపోయాడు… స్నేహితుడి తన భార్యతో కలిసి చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీనితో తన జీవితం గాడితప్పింది. క్రికెట్ లో వరుసగా ఫెయిల్యూర్ అవుతూ వచ్చాడు. ఈ కారణంగా మొదట ఇండియన్ టీమ్ కు దూరం అయ్యాడు.. ఆ తర్వాత తమిళనాడు జట్టుకు దూరం అయ్యాడు. అప్పుడే మురళి విజయ్ తమిళనాడు కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఇలా పర్సనల్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ దెబ్బ తినడంతో దినేష్ కార్తిక్ మద్యానికి బానిస అయ్యాడు. జిమ్ కు వెళ్ళడం మానేశాడు. నిత్యం అదే ఆలోచనలతో దారుణంగా తయారయ్యాడు.. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు.

ఇదే సమయంలో తాను అప్పట్లో జిమ్ కు వెళుతున్న ట్రైనర్ ఇంటికి వచ్చి తనతో మాట్లాడి.. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంతటితో జీవితం అయిపోలేదు కదా, తిరిగి జీవితాన్ని ప్రారంభించు అంటూ తనలో నూతన ఉత్తేజాన్ని నింపడానికి ట్రై చేశాడు. అలా దినేష్ కార్తిక్ జిమ్ కు రావడం స్టార్ట్ చేశాడు. అయితే అదే సమయానికి ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ కూడా అదే జిమ్ కు వచ్చేది. ఇతని పరిస్థితి చూసి జిమ్ ట్రైనర్ తో కలిసి దినేష్ కార్తిక్ ను మార్చడానికి తన వంతు కృషి చేసింది. అలా దీపిక మాటలతో తనలో మెల్లగా మార్పు రావడం మొదలైంది. తిరిగి మళ్లీ క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. దీపికా సహాయంతో మళ్లీ దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో మురళి విజయ్ తన ఆటపై పట్టు కోల్పోయాడు. దానితో ఇండియన్ టీమ్, తమిళనాడు టీమ్ మరియు ఐపిఎల్ లోని చెన్నై సూపర్ కింగ్స్ నుండి తీసివేయబడ్డాడు. అప్పుడే దినేష్ కార్తిక్ మరియు దీపిక లు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ తమ తమ ప్రొఫెషన్ లతో బిజీ అయిపోయారు. ఇద్దరికీ కవలలు కూడా జన్మించారు. ఆ తర్వాతనే దీపిక స్క్వాష్ ఛాంపియన్ గా అవతరించింది.

అప్పుడు మళ్ళీ దినేష్ కార్తిక్ తమిళనాడు టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. ఐపిఎల్ లో మళ్లీ ప్రవేశించి అద్భుతంగా రాణించి కోల్కతా టీమ్ కు కెప్టెన్ అయ్యాడు. అయితే ఆ తర్వాత 2022 ఐపిఎల్ కు మెగా వేలం జరగడంతో ఎన్నో ఫ్రాంచైజీ లు దినేష్ కార్తిక్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాయి. అయితే బెంగళూర్ ఇతనిని వికెట్ కీపర్ బ్యాట్స్మన్ గా కొనుగోలు చేసి మంచి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ లో దినేష్ కార్తిక్ బెంగళూర్ జట్టుకు మంచి ఫినిషర్ గా మారాడు. అతి తక్కువ బంతుల్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పుడు మళ్లీ దినేష్ కార్తిక్ ఇండియన్ టీమ్ లోకి సెలెక్ట్ అవుతాడని చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పుడు మీరే ఆలోచించండి తన స్నేహితుడు భార్య చేసిన ఘోరమైన మోసం వలన మరణాలు అంచుల వరకు వెళ్లిన దినేష్ కార్తిక్ ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యి లైఫ్ లో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇతని జీవితం ఎందరో క్రీడాకారులకు, జీవితంలో చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పాలి. సమస్య వచ్చిందని భయపడి పారిపోతే మీరు ఎప్పటికీ పైకి లేవలేరు. అదే సమస్యను తొక్కుకుంటూ పైకి లేవాలి అప్పుడే మీరు సక్సెస్ కాగలరు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago