Featured

Minister Roja : మహానాడుపై ఘాటు వాఖ్యలు.. జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ నుండి అందుకే దూరం పెట్టారు..!

MLA ROJA : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని తెలుగుదేశం పార్టీ మహానాడుగా జరుపుకుంటారు. ఇక ఈ వేడుకలు శుక్రవారం ఒంగోలులో ఘనంగా మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడులో వైసీపీ పాలనను విమర్శించారు. ఇక ఈ కామెంట్స్ కి కౌంటర్ వేయాల్సిందే కదా ఏపీ పర్యాటక మంత్రి రోజా ఆ భాద్యతను తీసుకున్నారు. తిరుపతి పర్యటన ముగించుకున్న రోజా మహానాడుపై, చంద్రబాబుపై తీవ్రంగా స్పందించింది.

జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీకి దూరం చేసారు….

ఇక స్వర్గీయ ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ, ఆయన్ను చంపేసి ఇపుడు మాత్రం ఫోటోకు దండలు వేసి దండం పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి భయపడి తెలుగుదేశం పార్టీకి దూరం పెట్టారని ఫైర్ అయింది. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని 99 % ప్రజలు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు ప్రేమతో ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ బ్రతికుంటే చంద్రబాబుని తరిమికొట్టేవారని , రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని ఎన్టీఆర్ అన్నారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ బ్రతికుంటే ఇపుడు చంద్రబాబు పరిస్థితి ఏంటో అందరికి తెలుసనీ అన్నారు.

మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి టీడీపీ, జనసేన పనే….

బీ ఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టాలనుకుంటే దళిత ఎమ్మెల్యే, బీసీ మంత్రి ఇంటిని కాల్చారని ఇది టీడీపీ, జనసేన కుట్ర అంటూ ధ్వజమెత్తారు. మంత్రి ఇంటిని కాల్చినవారు ఎంతటి వారైనా వదిలే సమస్య లేదని చెప్పారు. అల్లర్లను అదుపుచేయడంలో పోలీసులు చక్కగా వ్యవహరించారని ప్రశంసించారు. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టినా కనీసం చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పలేదని చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

2 days ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

2 days ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

3 days ago