రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ నంబర్లతో ట్రైన్ టైమ్, ఇతర వివరాలు తెలుసుకునే ఛాన్స్..?

దేశంలోని చాలామంది ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి రైళ్ల ద్వారా ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే చాలా సందర్భాల్లో ట్రైన్ అనుకున్న సమయానికి రాకపోవడం, ఇతర ఇబ్బందులను ప్రయాణికులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే రైళ్ల ద్వారా ప్రయాణాలు చేసేవాళ్లు కొన్ని ఫోన్ నంబర్ల ద్వారా రైలు ఎక్కడుందో, ఆలస్యంగా నడుస్తుందో లేక సరైన సమయానికి వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

రైలు ప్రయాణికులు సులభంగా పీఎన్ఆర్ స్టేటస్ ను కూడా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 91 – 9881193322 నంబర్ ను స్మార్ట్ ఫోన్ లో సేవ్ చేసుకొని వాట్సాప్ యాప్ ద్వారా పీఎన్ఆర్ నెంబర్ ను ఎంటర్ చేసి సులభంగా రైలు ప్రయాణానికి సంబంధించిన అప్ డేట్స్ ను తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ నెంబర్ ఆధారంగా రైలు ప్రయాణానికి సంబంధించిన ప్రతి అప్ డేట్ వాట్సాప్ యాప్ కు వస్తుంది.

ఈ నంబర్ ను సేవ్ చేసుకోవడం ద్వారా రైలు ప్రయాణానికి సంబంధించి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా, ఎవరినీ అడకుండా సులభంగా ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల రైల్వే శాఖ పరిమిత సంఖ్యలోనే రైళ్లను నడుపుతోంది. ఆ నంబర్ మాత్రమే కాకుండా మరో నంబర్ ద్వారా కూడా వాట్సాప్ ట్రైన్ అప్ డేట్స్ తెలుసుకోవచ్చు.

91 – 7349389104 నంబర్ ద్వారా కూడా రైలు ప్రయాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌ లలో రైల్వే శాఖ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. రైల్వే శాఖ తెచ్చిన కొత్త ఫీచర్ల ద్వారా రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.