ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవానికి సమస్త మానవాళి ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరాలు తప్ప మిగిలిన వ్యాపారాలు అన్ని బంద్ అయ్యాయి. కరోనా దెబ్బకు మిగిలిన ఎలా ఉన్నా… పాపం మందు బాబులు మాత్రం విలవిలలాడిపోతున్నారు. అలవాటైపోయిన ప్రాణం ఒక్కసారిగా మందు దొరక్క చాలా ఇక్కట్లు పడుతున్నారు. మందు దొరక్క కొందరు వింత వింతగా ప్రవర్తిస్తూ ఆసుపత్రి పాలైతే.. మరికొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు.
ఇక దీనిపై దృష్టిపెట్టిన యువతరం మాత్రం మరో వినూత్న ప్రయత్నం చేస్తోంది. ఇన్ని బాధలు పడటం ఎందుకు… మనమే మద్యం చేసుకుంటే పోలా.. అనుకుంటున్నారు నేటి యువత. అనుకున్నదే తరువుగా తమ ఆలోచనలను గూగుల్ తల్లికి చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది.. “హౌ తో మేక్ ఆల్కహాల్ ఎట్ హోమ్” అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే ఫుల్ ట్రెండ్ అవుతుంది. గడిచిన కొద్దిరోజులుగా గూగుల్ లో అత్యంత సెర్చ్ అవుతున్న టాపిక్ ఇదేనట. లాక్ డౌన్ మొదలుపెట్టిన తొలివారం నుంచే ఈ సెర్చ్ పీక్స్ లోకి వెళ్లిందట. ఇక మార్చి 22 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ టాపిక్ సెర్చ్ చేస్తున్న వారిలో అత్యధికులు మణిపూర్ రాష్ట్రము వారేనట. ఈ రకంగా మణిపూర్ తోలి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయట.
దీనితో పాటుగా బీర్ ఎలా తయారు చేసుకొవాలి అనేది కూడా గూగుల్ సెర్చ్ చేస్తున్నారట. “హౌ టూ మేక్ బీర్ ఎట్ హోమ్” అనే పదం ట్రేండింగ్ అయిందట. దీని కోసం సెర్చ్ చేసిన వారిలో ఢిల్లీ టాప్ ప్లేస్ లో ఉందట. ఆ తరువాత స్థానంలో హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర వాసులు ఎక్కవగా సెర్చ్ చేశారట. ఆ తరువాత స్థానంలో తెలంగాణ, తమిళనాడు, ఆంద్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వాసులు ఉన్నారట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…