Vishwaksen: పాగల్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే ఆరో తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో విశ్వక్సేన్ చేసిన ఒక ఫ్రాంక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలు పెట్టారు.ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే… హీరో విశ్వక్సేన్ ఫిలింనగర్ రోడ్డుపై కారులో వెళ్తుండగా ఒక అభిమాని తన కారుకు అడ్డంగా పడి తాను హీరో అల్లు అర్జున్ కుమార్ కి(అశోకవనంలో అర్జున కళ్యాణం హీరో పాత్ర) 33 సంవత్సరాలు వచ్చిన ఇప్పటివరకు పెళ్లి కాలేదు నాకు చాలా బాధగా ఉంది అందుకే నేను పెట్రోల్ పోసుకొని చనిపోతున్నాను అంటూ పెట్రోల్ మీద పోసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేశాడు.
ఇక హీరో విశ్వక్సేన్ కూడా ఈ విషయం తనకి ఏమీ తెలియదు అన్నట్టుగా బాగా నటించారు.ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ విషయం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ హీరో విశ్వక్సేన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా బాగుంటే తప్పకుండా అందరూ చూస్తారు. లేదంటే ఎవరూ చూడరు.
సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి జిమ్మిక్కులు ప్లే చేసి ఇలా దారుణాలకు పాల్పడటం అవసరమా? ప్రమోషన్ల కోసం మరి ఇంతగా దిగజారాలా? ఈ విధంగా పబ్లిక్ ప్లేస్ లో ఇంత పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసి ట్రాఫిక్ కి అంతరాయం కలిగించడం ఏంటీ అంటూ తీవ్రస్థాయిలో చిత్ర బృందం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…