Categories: General News

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తని.. ‘మాధురి’ స్కెచ్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! వెలుగులోకి సంచలన నిజాలు!

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరులో జరిగిన శివనాగరాజు హత్య కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోంది. భార్య అంటే ఇంటికి మహాలక్ష్మి అనుకుంటాం.. కానీ ఇక్కడ మాత్రం ఆ భార్యే కాలయముడు అయ్యింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, ఆస్తిపై ఆశతో కట్టుకున్న వాడిని అత్యంత కిరాతకంగా చంపేసింది. అసలు ఈ ‘కిలేడీ’ మాధురి వేసిన ప్లాన్ చూస్తే.. సినిమా విలన్లు కూడా షాక్ అవ్వాల్సిందే!

అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే..

శివనాగరాజు భార్య మాధురికి గోపి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం శివనాగరాజుకు తెలిసిపోయింది. దాంతో ఇంట్లో రోజూ గొడవలు మొదలయ్యాయి. అసలు తన వెనక ఏం జరుగుతుందో పక్కా సాక్ష్యాలతో పట్టుకోవాలని, శివనాగరాజు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు.

సీసీ కెమెరాల భయంతో షాకింగ్ స్కెచ్!

ఎక్కడ తన గుట్టు బయటపడుతుందో అని మాధురికి భయం పట్టుకుంది. అందుకే భర్తను అడ్డుతొలగించుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఇక్కడే ఆమె చాలా తెలివిగా ప్లాన్ వేసింది. ముందే పోలీసులకు వెళ్లి “మా ఆయన నన్ను వేధిస్తున్నాడు” అని కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత బెదిరించి, పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని తన పేరు మీద రాయించుకుంది. ఆస్తి చేతికి రాగానే అసలు వేట మొదలుపెట్టింది.

బిర్యానీలో మృత్యువు!

హత్య చేయడానికి మాధురి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్లి నిద్రమాత్రలు సంపాదించింది. పక్కా ప్లాన్ ప్రకారం.. ఆ రాత్రి భర్తకు ఎంతో ఇష్టమైన బిర్యానీ తెప్పించి, అందులో ఆ నిద్రమాత్రలు కలిపేసింది. పాపం.. భార్య ప్రేమతో పెడుతోంది అనుకుని శివనాగరాజు ఆ బిర్యానీ తిని గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు.

ప్రియుడితో కలిసి ఘాతుకం..

అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. అప్పటికే బయట వెయిట్ చేస్తున్న ప్రియుడు గోపిని లోపలికి పిలిచింది. ఇద్దరూ కలిసి ఏమాత్రం కనికరం లేకుండా శివనాగరాజును చంపేశారు. అయితే ఏమీ తెలియనట్టు యాక్ట్ చేసినా.. పోలీసులు తమ స్టైల్లో విచారించేసరికి అసలు నిజాన్ని కక్కేసింది.

ప్రస్తుతం పోలీసులు మాధురిని, ఆమె ప్రియుడు గోపిని, అలాగే మందులు ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్‌ను కూడా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఆస్తి కోసం, అక్రమ సంబంధం కోసం నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఈ ఘటన స్థానికంగా పెను కలకలం రేపింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago