గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరులో జరిగిన శివనాగరాజు హత్య కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోంది. భార్య అంటే ఇంటికి మహాలక్ష్మి అనుకుంటాం.. కానీ ఇక్కడ మాత్రం ఆ భార్యే కాలయముడు అయ్యింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, ఆస్తిపై ఆశతో కట్టుకున్న వాడిని అత్యంత కిరాతకంగా చంపేసింది. అసలు ఈ ‘కిలేడీ’ మాధురి వేసిన ప్లాన్ చూస్తే.. సినిమా విలన్లు కూడా షాక్ అవ్వాల్సిందే!

అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే..
శివనాగరాజు భార్య మాధురికి గోపి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం శివనాగరాజుకు తెలిసిపోయింది. దాంతో ఇంట్లో రోజూ గొడవలు మొదలయ్యాయి. అసలు తన వెనక ఏం జరుగుతుందో పక్కా సాక్ష్యాలతో పట్టుకోవాలని, శివనాగరాజు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు.
సీసీ కెమెరాల భయంతో షాకింగ్ స్కెచ్!
ఎక్కడ తన గుట్టు బయటపడుతుందో అని మాధురికి భయం పట్టుకుంది. అందుకే భర్తను అడ్డుతొలగించుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఇక్కడే ఆమె చాలా తెలివిగా ప్లాన్ వేసింది. ముందే పోలీసులకు వెళ్లి “మా ఆయన నన్ను వేధిస్తున్నాడు” అని కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత బెదిరించి, పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని తన పేరు మీద రాయించుకుంది. ఆస్తి చేతికి రాగానే అసలు వేట మొదలుపెట్టింది.
బిర్యానీలో మృత్యువు!
హత్య చేయడానికి మాధురి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్లి నిద్రమాత్రలు సంపాదించింది. పక్కా ప్లాన్ ప్రకారం.. ఆ రాత్రి భర్తకు ఎంతో ఇష్టమైన బిర్యానీ తెప్పించి, అందులో ఆ నిద్రమాత్రలు కలిపేసింది. పాపం.. భార్య ప్రేమతో పెడుతోంది అనుకుని శివనాగరాజు ఆ బిర్యానీ తిని గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు.
ప్రియుడితో కలిసి ఘాతుకం..
అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. అప్పటికే బయట వెయిట్ చేస్తున్న ప్రియుడు గోపిని లోపలికి పిలిచింది. ఇద్దరూ కలిసి ఏమాత్రం కనికరం లేకుండా శివనాగరాజును చంపేశారు. అయితే ఏమీ తెలియనట్టు యాక్ట్ చేసినా.. పోలీసులు తమ స్టైల్లో విచారించేసరికి అసలు నిజాన్ని కక్కేసింది.
ప్రస్తుతం పోలీసులు మాధురిని, ఆమె ప్రియుడు గోపిని, అలాగే మందులు ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్‌ను కూడా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఆస్తి కోసం, అక్రమ సంబంధం కోసం నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఈ ఘటన స్థానికంగా పెను కలకలం రేపింది.































