అతడికి 20 ఏళ్ల కిందట పెళ్లైంది. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. పెళ్లైన కొన్ని రోజుల వరకు వీళ్ల ఫ్యామిలీ ఆనందంగానే ఉన్నారు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు తీవ్ర కల్లోలం రేపాయి. వీళ్లు గుజరాత్‌లోని రాజ్‌కోట్ సిటీ దగ్గర సురేంద్ర నగర్‌లో నివసిస్తున్నారు. అందులో భార్యభర్తల్లో భర్త పేరు అరవింద్. అతడు ఎప్పటికలాగే ఆఫీస్ కు వెళ్లేవాడు. అక్కడ తోటి ఉద్యోగులతో ఫ్రీ టైంలో మాట్లాడే సమయంలో అతడికి.. భార్యను కంట్రోల్ లో పెట్టుకోవాలి.. లేదంటే వాళ్లు వేరే వాళ్లను వెతుక్కుంటారు అనే మాటలు అతడికి వినపడేవి.
మొదట్లో అతడు అంతగా పట్టించుకోలేదు.. కానీ ఓ రోజు ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్లగానే… తన భార్య… ఎవరితోనో సరదాగా ఫోన్‌లో మాట్లాడటం చూశాడు. ఆఫీసులో మాటలు గుర్తొచ్చాయి. ఆ సమయం నుంచి అతడికి అనుమానం ఎక్కువగా మొదలైంది. ఫోన్లో ఎవరు అని అడిగితే పుట్టింటి వాళ్లని ఆమె చెప్పింది. ఆ క్షణం ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత కూడా మార్కెట్ కు అని వెళ్లిన ఆమె ఎందకు ఇంటికి రాలేదు.. ఫోన్ చేస్తే కాల్ రిసీవ్ చేయడం లేదు.
దీంతో అనుమానం మళ్లీ మొదలైంది. ఇంటికి వచ్చాక అడిగాడు. ట్రాఫిక్ జామ్ వల్ల మీరు కాల్ చేసిన విషయమే నాకు తెలియలేదు. ఫోన్ బ్యాగ్ లో ఉంది.. అందుకే కాల్ తీయలేకపోయాను అని సమాధానం ఇచ్చింది. అయినా అతడు నమ్మలేదు. ఆఫీస్ లో వాళ్లు ఇలానే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారనే చెప్పిన మాటలు అతడి ఆలోచనలోకి వస్తున్నాయి. ఇలా అతడు రాను రాను భార్యపై విపరీతంగా అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు ఓ రోజు అర్థమైంది. అనుమానాన్ని ఎలాగైనా తగ్గించాలని అనుకుంది. అయినా కుదరకపోవడంతో ఇద్దరు విడిపోయారు.
పెళ్లై 20 ఏళ్లైనా ఇప్పటికీ తన భర్త తనను నమ్మట్లేదేంటని బాధపడేది. దీంతో చివరకు భర్తపై కేసు పెట్టింది. ఆమెకు విడాకులు ఇచ్చేద్దామని అనుకుంటున్న సమయంలో… అరవింద్‌కి ఈ నోటీస్ వచ్చింది. దూరంగా ఇవన్నీ తట్టుకోలేక ఆమె భర్త పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహేతర సంబంధం ఉందా.. లేదా..అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
జ్యోతిష్య విశ్వాసాల్లో శని Dev ప్రత్యేక స్థానం కలిగిన దేవతగా భావిస్తారు. కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవుడిగా ఆయనను…
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ స్థానం కలిగిన Srisailam Temple క్షేత్రానికి భక్తుల రాకపోకలు ఎప్పుడూ కొనసాగుతూనే…
తలనొప్పి అనగానే చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఒక వైపున గుచ్చినట్లుగా తీవ్రంగా వచ్చే నొప్పి, దానికి తోడు…
వేసవికాలం మొదలైనప్పుడల్లా శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల కోసం చాలా మంది వెతుకుతుంటారు. బయట దొరికే కూల్‌డ్రింక్స్ తాత్కాలికంగా చల్లదనం…
తెలుగు వంటల్లో పాతకాలపు రుచులకు ప్రత్యేక స్థానం ఉంది. కాలం మారుతున్న కొద్దీ కొత్త రకాల ఫుడ్ అలవాట్లు పెరిగినా,…
వంటగదిలో ఉపయోగించే పాత్రల ఎంపిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే విషయం ఇప్పుడిప్పుడే ఎక్కువగా చర్చకు వస్తోంది. గతంలో నుంచి అల్యూమినియం…