General News

రాఖీ పండుగ సందర్భంగా ఎబీఐ బంపర్ ఆఫర్.. వాటిపై డిస్కౌంట్లు..

రాఖీ పండుగను పురస్కరించుకుని ఎస్‌బీఐ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రక్షా బంధన్ నేపథ్యంలో ఆన్‌లైన్ కోనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. షాపింగ్ పై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో చాలామంది ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికే ఎక్కువగా శ్రద్ధ చూసిస్తున్నారు. తమ కస్టమర్ల శ్రేయస్సు కొరకు ఆన్‌లైన్ షాపింగ్‌నే ప్రోత్సహిస్తున్నామని ఎస్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ఎస్‌బీఐ రక్షా బంధన్ ఆఫర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 20 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది. రక్షా బంధన్ నేపథ్యంలో తమ సోదరీమణుల కోసం బహుమతులు కొనాలనుకునే వారికి ఈ ఆఫర్ ఆకర్షణీయంగా ఉంటుందని తెలిపింది.

ఎంత తక్కువ మొత్తంలో షాపింగ్ చేసినా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని SBI స్పష్టం చేసింది. అయితే.. గరిష్టంగా డిస్కౌంట్ రూ. 999 వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి, వినియోగదారులు SBI యోనో యాప్‌ని ఉపయోగించాలి. ఈ యాప్ ద్వారా మీరు డిస్కౌంట్ ప్రయోజనాన్ని పొందుతారు. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే SBI YONO, sbiyono.sbi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు. SBI తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ఆఫర్ గురించిన సమాచారం ఇచ్చింది. ఈ ఆఫర్ రాఖి పండగ అయిన ఆగస్టు 22 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ తెలిపింది.

SBI20 కోడ్ ను ఉపయోగించి షాప్ చేస్తే డిస్కౌంట్ అందుకోవచ్చు. అంతేకాకుండా మరో ఆఫర్ ను కూడా అందుబాటులో ఉంది. అదేంటంటే.. జీవన్‌శైలి స్టోర్.కామ్ నుండి వస్తువుల కొనుగోలుపై 60% వరకు తగ్గింపు లభిస్తుంది. డ్రెస్సులతో సహా ఈ స్టోర్ నుండి లగ్జరీ వస్తువులు, ఫ్యాషన్ వస్తువులు కొనుగోలు చేయొచ్చు. వీటి కోసం చెల్లింపులను యోనో యాప్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఒక కస్టమర్ SBI కార్డ్‌తో కొనుగోలు చేస్తే, అతనికి 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇవ్వబడుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

8 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

8 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

8 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

8 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

8 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

9 hours ago