Featured

లుంగీలో పవన్ కళ్యాణ్.. ఊర మాస్ లుక్‌లో టీజర్ దద్దరిల్లిపోయిందిగా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొంతకాలం విరామం తర్వాత సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో కనిపించగా సినిమా టైటిల్ కూడా ఇదే ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ “భీమ్లా నాయక్” అంటూ చిత్రబృందం ఆదివారం ఉదయం తెలియజేయడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

bheemla nayak

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ లుక్, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తాజాగా ఆగస్టు 15 సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్ విడుదల చేశారు. ఇందులో పవర్ స్టార్ మాస్ లుక్ లో లుంగీ కట్టీ “ఒరేయ్‌ డేనీ.. బయటకు రారా.. ” అంటూ పవర్‌స్టార్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ అభిమానులకు కిక్కేకిస్తోందని చెప్పవచ్చు. ఇందులో . ‘డేని.. డేనియల్‌ శేఖర్‌’అని రానా చెప్పగా… భీమ్లా ..భీమ్లా నాయక్ అంటూ పవర్ స్టార్ చెప్పిన డైలాగులు కేక పుట్టిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ గ్లింప్ విడుదల చేస్తూ ఈ సినిమాకు “భీమ్లానాయక్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, నిత్యమీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago