Featured

Big Breaking : విశాఖపట్నం HPCL లో భారీ అగ్ని ప్రమాదం..!

విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)‌లో లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖపట్నంలోని హెచ్‌పిసిఎల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హెచ్‌పీసీఎల్ పరిసరాల్లో దట్టమైన పొగలు అలముకున్నాయి. …

మరోవైపు, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయానికి పరిశ్రమ లోపల సుమారు 100 మంది పైగా HPCL ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ప్రజలను ఖాళీచేయిస్తున్నారు. రిఫైనరీలోని ఓల్డ్ యూనిట్‌లోని టెర్మినల్-3 వద్ద ఈ అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సైరన్ లు మోగించారు. దీనితో ఉద్యోగులను పరిశ్రమ నుంచి బయటకు పంపుతున్నారు. హెచ్‌పీసీఎల్‌లో మూడో యూనిట్లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇది చాలా సున్నితమైన యూనిట్ కావడంతో ఇక్కడ భారీస్థాయిలో మండే పదార్థాలు ఉంటాయి. నిరంతరం అగ్నిమాపక సిబ్బంది ఈ యూనిట్‌లో అప్రమత్తంగా ఉంటారు.

ముడి చమురును ఈ యూనిట్‌లోనే ప్రాసెస్‌ చేస్తారని సమాచారం.. యూనిట్‌ మొత్తం మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. సుమారు 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు. ఏదైనా ప్రాణనష్టం జరిగిందో లేదో కూడా ఇంకా పూర్తీ సమాచారం రావాల్సి ఉంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago