బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకొని.. ఆడియన్స్ లో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది జబర్దస్త్ యాంకర్ అనసూయ. ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు..ఇంకో వైపు సోషల్ మీడియాలో ఇలా నిత్యం బిజీ బిజీగా గడుపుతోంది ఈ హాట్ యాంకర్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులతో టచ్ లో ఉండే అనసూయ.. అప్పుడప్పుడు తన హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈ యాంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ “పుష్ప”లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ బన్నీ డెడికేషన్ చూసి ఆమే స్టన్ అయిపోయిందట ఈ ముద్దుగుమ్మ. బన్ని ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇదే మొదటి సినిమా అనేలా చేస్తాడు. నేను షూటింగ్ లో ఉన్న నాలుగు రోజులు బన్నీ లో చాలా విషయాలు గమనించాను. అర్జునుడు చెట్టు మీద వున్న పక్షిపై మాత్రమే ఏకాగ్రత పెట్టినట్లుగా. బన్నీ కళ్ళు కూడా ఎప్పుడూ డైరెక్టర్ చెప్పిన పాయింట్ మీదే ఉంటాయని అంటుంది ఈ హాట్ యాంకర్..
కాగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ’పుష్ప’ నుంచి ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజును సందర్భంగా ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో ఒక వీడియో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికీ ఈ వీడియో ‘తెగ్గేదే లే’ అంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోండి.. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా. కధానాయికగా రాష్మిక మందన్నా నటిస్తోంది.. ఇక ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగ ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇక సంగీతం టాలీవుడ్ రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో అది కుదిరేలా లేదు..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…