Telangana News: పోలీసు వారి పాట.. రూ.51.74 లక్షలు జమ!
Telangana News: ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నసమయంలో దాదాపు వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటారు. లేదంటే.. బ్యాంక్ లో పర్సనల్ లోన్ తీసుకుంటారు. అవి రెండు కూడా సాధ్యం కాకపోతే వాళ్ల దగ్గర ఉన్న వస్తువులు అంటే.. బంగారం, వాహనాలను తనఖా పెట్టేసి అవసరానికి డబ్బులను తెచ్చుకుంటారు.
అయితే ఆ డబ్బులను తీర్చలేని క్రమంలో రెండు మూడు సార్లు నోటీసులు పంపించి.. తర్వాత న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చి వేలం వేస్తుంటారు. అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇలాంటి వేలం పాటలను నిర్వహిస్తుంటారు.
కానీ అవి తనఖా పెట్టి డబ్బులు తీసుకెళ్లిన బాపతి కాదు.. వాటిని నిబంధనలు ఉల్లంఘించిన వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు. ఆ వాహనాలకు పలు కేసుల్లో పోలీసులు సీజ్ చేస్తుంటారు. అయితే తాజాగా గోషామహల్ స్టేడియంలో పేరుకుపోయిన 600 వాహనాలకు హైదరాబాద్ సిటీ పోలీసులు మంగళవారం వేలం నిర్వహించారు.
నిబంధనలను అనుసరించి తిరిగి తీసుకోవాలని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించినా యజమానులు ముందుకు రాలేదు. అయితే వాటిని ఆ పోలీసులు వేలం నిర్వహించారు. రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 550 మంది బిడ్డర్లు పాల్గొనగా. వాటిలో.. 567 వాహనాలు వేలం నిర్వహించారు. వాటిలో 544 ద్విచక్రవాహనాలు ఉండగా.. 21 త్రిచక్రవాహనాలు.. 2 కార్లు ఉన్నాయి. వీటి ద్వారా రూ. 44.28 లక్షలు సమకూరినట్లు పేర్కొన్నారు. ఇవి కేవలం సర్కాస్ కు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. వినియోగించేందుకు అనుకూలంగా ఉన్న 33 వాహనాలలో 32 ద్విచక్రవాహనాలు ఉండగా .. ఓ కారు ఉందన్నారు. వీటి ద్వారా రూ. 7.46లక్షలు వచ్చాయని పేర్కొన్నారు. మొత్తం వేలం ద్వారా రూ. 51.74 లక్షలను ఖజానాలో జమ చేయనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ వేలం నిష్పక్షపాతంగా జరిగేలా సీపీ పర్యవేక్షించారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…