Cricket-rohit sharma: నన్ను పట్టించుకో ... ఒకసారి ఫోన్ చేయండి అంటున్న రోహిత్ శర్మ భార్య రితికా..!
Cricket-rohit sharma: సెలబ్రెటీ హోదా ఉన్నవారు ఎక్కువగా కుటుంబానికి సమయం కేటాయించే అవకాశం ఉండదు. ముఖ్యంగా క్రీడాకారులు మరింతగా ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. వివిధ టోర్నీలకతో బిజీగా ఉంటారు. ఒక్కోసారి కట్టుకున్న భార్యతో మాట్లాడే సమయం కూడా ఉండదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్శ కూడా దీనికి అతీతం కాదు. తాజాగా భార్య రితికా మిస్ కాల్ ఇచ్చినా.. రోహిత్ స్పందించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా బీసీసీఐ అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించింది. దీంతో వరస టోర్నీలతో రోహిత్ శర్మ బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ లు జరిగాయి. దీని తర్వాత.. లంక జట్టు ఇండియాలో టూర్ కు రాబోతున్నారు. దీంతో వరస టోర్నీలు, బిజీ షెడ్యూల్ తో రోహిత్ శర్మ బిజీగా ఉన్నారు.
ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన వన్డే, టీ20 సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన మరింత ఉత్సాహంతో ఉన్నారు. తను నాయకత్వం వహించిన సీరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో రోహిత్ శర్మ ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఇదిలా ఉంటే… టీమిండియా కెప్టెన్ హోదాలో ఫుల్ జోష్‌లో ఉన్న రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఫోటోలతో పాటు ”తర్వాతి టార్గెట్ లంక అని.. నెక్ట్స్ అప్.. బీ రెడీ” అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇది చూసిన భార్య రితికా.. రోహిత్‌ను ఉద్దేశించి ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చింది. ”అంతా గ్రేట్‌గా కనిపిస్తుంది.. ప్లీజ్ నాకు ఒకసారి ఫోన్ చేయ్” అంటూ పేర్కొంది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ రితికా శర్మ మెసేజ్‌కు లైక్‌లు, షేర్స్ కొడుతూ కామెంట్ చేశారు. ”రోహిత్ నీ భార్యను కాస్త పట్టించుకో.. ఎంత కెప్టెన్ అయితే మాత్రం కట్టుకున్న భార్యను మరిచిపోతావా” అంటూ పేర్కొన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…