చాలామంది డాబాలపై మొక్కలను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో కొందరు పూల మొక్కలను ఎక్కవగా పెంచుతుంటే.. మరికొందు కూరగాయల మొక్కలను పెంచుతుంటారు. అయితే హైదరాబాద్ లో నివాసం ఉంటున్న సాయి లీల అనే మహిళకు మొదటి నుంచి మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టం.
అయితే మొదట్లో ఆమె డాబాపై పూల మొక్కలను పెంచుకుంటూ ఉండేది. ఆమెను చూసి చుట్టు పక్కన ఉన్న వాళ్లు కూడా పెంచేవారు. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం ఆమెకు థైరాయిడ్ వచ్చింది. దీంతో వైద్యులను సంప్రదించగా.. ఆమెను కలుషితం లేని ఆహారాన్ని.. రసాయనాలతో పండించని కూరగాయాలను తీసుకోవాలని సూచించారు.
దీంతో అప్పుడే ఆమెకు తన డాబాపై కూరగాయ మొక్కలను కూడా పెంచితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దీంతో మరి కొన్ని కుండీలను తీసుకొచ్చింది. మొత్తం ఆమె 800 కుండీల వరకు తెచ్చి అందులో 190 రకాల మొక్కలను పెంచుతోంది. అందులో కూరగాయ మొక్కలు ఉన్నాయి.. అంతే కాకుండా పూల మొక్కలు కూడా ఉన్నాయి. డాబాపై ఆమె ఒక పెద్ద తోటనే పెంచుతోంది. వాటికి ఎలాంటి రసాయాన మందులు వేయలేదు.
కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే తీసుకొని మొక్కలను పెంచుతోంది. ఈ రకాలన్నీ చైనా, టర్కి, అమెరికా, ఇథియోపియా, ఇటలీ, మెక్సికో వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న విత్తనాల ద్వారా గార్డెన్ ను అభివృద్ధి చేశారు. ఇలా ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు.. కూరగాయలను విక్రయిస్తూ ఆదాయాన్ని కూడా పెంచుకున్నారు. దీంతో ఆమె ఒక యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించింది. అందులో తన అభిరుచులు, ఐడియాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టారు. ఆమె చేస్తున్న వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. లక్షల్లో సబ్ స్క్రైబర్స్ ను సొంతం చేసుకొని విజయవంతంగా కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…