Movie News

డబ్బులు ఇచ్చేది అందుకే.. ‘అర్జెంటుగా షూటింగ్ కు వెళ్ళు..’ అంటూ బాలకృష్ణకు ఆర్డర్ వేసిన ఎన్టీఆర్!

సీనియర్ నటుడు, విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు నటించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన రామారావు ఇప్పటికే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. రామారావు నటించిన ఎన్నో సినిమాలలో డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. నిజానికి సింగీతం శ్రీనివాస్ దర్శకధీరుడు కె.వి.రెడ్డి శిష్యునిగా ఇండస్ట్రీలోకి “మాయాబజార్” సమయంలోనే అడుగు పెట్టారు.

ఈ విధంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సింగీతం శ్రీనివాస్ ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈయన దర్శకత్వంలో ఎన్టీఆర్ తో సినిమా తీయాలనే ఆశ అలాగే మిగిలిపోయింది. కానీ ఆయన కుమారుడు బాలకృష్ణ హీరోగా మూడు సినిమాలను తెరకెక్కించారు. ఇందులో రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా ఒకటి మాత్రం ఫ్లాప్ సినిమాగా నిలబడిపోయింది. గత కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో సింగీతం శ్రీనివాస్ ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బాలకృష్ణ హీరోగా “ఆదిత్య 369”, “భైరవ ద్వీపం” “కృష్ణార్జున యుద్ధం” సినిమాలను తెరకెక్కించారు. సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ అచ్చం ఎన్టీ రామారావు గారి ఆలోచనా విధానాన్ని అతని పద్దతులను ఆచరించే వారిని శ్రీనివాస్ తెలియజేశారు. ఎన్టీఆర్ గారు పౌరాణిక వేషాలు వేసేటప్పుడు ఖాళీ సమయంలో తనపై ఉన్న నగలను తీయకుండా సాయంత్రం షూటింగ్ కి ప్యాకప్ చెప్పే సమయం వరక ఒంటిపై అలాగే వేసుకునేవారు, వాటిని తీసేస్తే మరి వేసుకోవడానికి సమయం పడుతుందని చెప్పేవారు. అచ్చం బాలకృష్ణ కూడా అదే పద్ధతులను అనుసరించేవారు.

ఆదిత్య 369 సినిమా షూటింగ్ జరిగేటప్పుడు భవిష్యత్ కాలం షాట్స్ తీసేటప్పుడు లైటింగ్ సెట్ చేసుకోవడానికి కాస్త సమయం ఎక్కువ పట్టేది. ఈ క్రమంలోనే సెట్స్ కి వచ్చిన ఆర్టిస్టులందరూ ఖాళీగా కూర్చునేవారు. అందుకోసమే బాలకృష్ణ గారిని కాస్త ఆలస్యంగా సెట్ కి రమ్మని చెప్పారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఇంట్లో కూర్చొని ఉండడంతో ఎన్టీఆర్ తన దగ్గరకు వెళ్లి ఏంటి షూటింగ్ లేదా అని అడిగారట.. ఉంది డైరెక్టర్ గారు ఆలస్యంగా రమ్మన్నారని బాలకృష్ణ చెప్పడంతో నిర్మాతలు మనకు డబ్బులు ఇచ్చేది వారికి ఎప్పుడూ మనం అందుబాటులో ఉండటం కోసమే ముందు మేకప్ వేసుకుని షూటింగ్ కి వెళ్ళు అంటూ ఆర్డర్ వేయడంతో బాలకృష్ణ వెంటనే షూటింగ్ కి వచ్చారని, అది అన్నగారి పద్ధతి ఆ పద్ధతినే బాలకృష్ణ కూడా అనుసరిస్తూ వచ్చారని ఓ సందర్భంలో సింగీతం శ్రీనివాస్ వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago