Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా పేరు సంపాదించుకున్న హైపర్ ఆది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువశక్తి సభలో భాగంగా హైపర్ ఆది కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా వైసిపి ప్రభుత్వంపై తమదైన శైలిలో సెటైర్లు వేస్తూ మాట్లాడారు.
ఈ క్రమంలోనే యువశక్తి వేదికపై హైపర్ ఆది కూడా మాట్లాడుతూ వైసీపీ మంత్రులపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ కార్యక్రమంలో ఆది మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కురిపిస్తూ ఆయనని ఆకాశానికి ఎత్తేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై కూడా తీవ్రస్థాయిలో ఆది మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ… ప్రజలకు మంచి చేయాలని ఆలోచన తప్ప మోసం చేయాలని ఆలోచన లేనటువంటి రాజకీయ నాయకులతో నిండి ఉన్న సభను మొదటిసారి చూస్తున్నాను అంటూ ఈయన మాట్లాడారు. ఇక ఈ సభకు వచ్చిన జనాలను చూసి ఇప్పటికే కొంతమందికుళ్ళుతో చచ్చిపోయి ఉంటారు వారి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించండి అంటూ సెటైర్స్ వేశారు.
ఎలాంటి పదవి దక్కించుకోవాలనుకున్న కొన్ని సంవత్సరాలు కష్టపడితే పదవి వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి దక్కించుకోవాలంటే ఎవరి వల్ల కాదని ఆయన స్థానం ఆయన స్థాయి వేరు అంటూ ఈ సందర్భంగా పవన్ పై ప్రశంసలు కురిపించారు. ఒక సినిమావాడిగా నేను ఇక్కడ మాట్లాడటానికి రాలేదని జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ నేతగా ఇక్కడికి వచ్చానట్టు హైపర్ ఆది చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…