Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం ఈటీవీలో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు.అయితే ప్రస్తుతం హైపర్ ఆది ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.
ఇలా ఒకసారి వెళ్లి వచ్చిన ఆది మరోసారి జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉండడానికి గల కారణం తెలియక పోయినప్పటికీ ఈ విషయం మాత్రం తరచూ చర్చలకు కారణం అవుతుంది.ఇకపోతే హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అనే పేరుతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఆటపాటలతో అందరినీ అలరించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో హైపర్ ఆది ఏకంగా పెదరాయుడు గెటప్ లో సందడి చేశారు. హైపర్ ఆది వేదికపై ఉండగా రష్మీ హైపర్ ఆదిని ప్రశ్నించారు. మీరు జబర్దస్త్ కార్యక్రమం వదిలి వెళ్ళడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు.
ఇలా ఆదిని ప్రశ్న అడిగినటువంటి రష్మీ జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుతో పాటు మరొక ఇద్దరి ఫోటోలను కూడా చూపించి కారణం చెప్పమన్నారు.హైపర్ ఆది మాత్రం తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి యాంకర్ సౌమ్యరావు కారణమంటూ అందరి ముందు ఓపెన్ గా చెప్పేసారు. ఇలా ఆది చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. దీంతో ఈ ప్రోమో పూర్తి అయింది మరి ఆది సౌమ్య వల్ల ఎందుకు జబర్దస్త్ కార్యక్రమం వదిలి వెళ్లాల్సి వచ్చిందనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…