Movie News

RRR Movie: నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై స్పందించని హీరోయిన్… నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్?

RRR Movie: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అంతే ఆదరణ సంపాదించుకొని ఎన్నో అవార్డులను అందుకున్నారు.ఇలా ఈ సినిమాకు ఇప్పటికే ఎన్నో పురస్కారాలు రాగా తాజాగా నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

ఇలా దేశం గర్వించేదగ్గ అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నటువంటి ఈ సినిమాపై అలాగే చిత్ర బృందంపై ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు స్పందించి వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి గర్వకారణం అంటూ ప్రధాని మోడీ కూడా ఈ సినిమా విజయంపై ప్రశంసలు కురిపించి అభినందనలు తెలిపారు.

ఇక ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ సెలబ్రిటీలు అలియాభట్,అజయ్ దేవగన్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు హీరోయిన్ గా నటించిన ఒలీవియా మోరిస్ మాత్రం ఇప్పటివరకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై స్పందించలేదు.

RRR Movie: నాటు నాటు పాటలో మెరిసిన ఒలీవియా….

నిజానికి ఈ సినిమాలో నటి ఆలియా కన్నా ఈమెకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది అంతే కాకుండా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నటువంటి నాటు నాటు పాటలో కూడా ఒలీవియా మోరిస్ సందడి చేస్తూ చిందులు వేశారు.ఇలా ఎంతో ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నటువంటి ఈ సినిమా విజయం పై ఇప్పటివరకు ఒలీవియా మోరిస్ స్పందించకపోవడంతో ఈమె మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి అని నేటిజన్స్ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago