Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పిన కొన్ని డైలాగులు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీని ఉద్దేశిస్తూ ఉన్నాయని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ లోనే బాలయ్య చెప్పిన ఒక పవర్ఫుల్ డైలాగ్ తెగ వైరల్ అయింది. “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ, ఆ చరిత్ర సృష్టించిన వారి పేరు మారదు.. మార్చలేరు..” అంటూ ప్రభుత్వ నిర్ణయాలపై బాలయ్య తన డైలాగ్ సో ఘాటుగా స్పందించినట్లు ప్రేక్షకులు భావించారు. ముఖ్యంగా మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఉద్దేశిస్తూ బాలయ్య ఈ డైలాగ్ చెప్పినట్లు అనిపిస్తోంది.
ఇక ఈ సినిమాలో ఇది మాత్రమే కాకుండా ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు చాలా ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులు అన్ని అధికార పార్టీని ఉద్దేశిస్తూ ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పిన మరొక డైలాగ్ కూడా బాగా వైరల్ అవుతుంది. ” ప్రజలు ఎన్నుకున్న వెధవలు వాళ్లు.. వాళ్లని గౌరవించడం మన ధర్మం, బాధ్యత ” అని ఒక సందర్భంలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ వైసిపి మంత్రులను ఉద్దేశిస్తూ చెప్పినట్లు ఉంది.
ఇలా వీరసింహరెడ్డి సినిమాలో బాలయ్య చెప్పిన చాలా డైలాగ్‌లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చెప్పినట్లు ఉండటం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలపై బాలయ్య తన మార్క్ డైలాగ్ డెలివరీతో ఘాటుగా స్పందించినట్లుగా నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈ డైలాగ్‌లకు సంబంధించిన థియేటర్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ డైలాగులపై వైసీపీ మంత్రులు కూడా స్పందిస్తూ తమదైన శైలిలో సమాధానాలు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…