Shruti Hasan : కమల్ హాసన్, సారిక కూతురు శృతి హాసన్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో పరిచయమై ఆ తరువాత టాప్ హీరోయిన్ గా అందరు హీరోలతో ఆడిపాడింది. అటు నటన, ఇటు డాన్స్ మరో వైపు పాటలు ఇలా అన్నింటా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ జోరు తగ్గి సినిమాలు తగ్గాయి. మళ్ళీ ‘క్రాక్’ సినిమాతో కాక పుట్టించిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా ఉంది. క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన శృతి హాసన్ అంతకు ముందు నాలుగేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ ను కవర్ చేస్తూ వరుసగా పెద్ద సినిమాల్లో చేస్తూ దూసుకుపోతోంది.
మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేసిన శృతి…
శృతి హాసన్ తాజాగా బాలకృష్ణ హీరోగా ‘వీర సింహా రెడ్డి’ అలానే చిరంజీవి తో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల్లో నటించింది. రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కాగా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే శృతి మీద గత కొన్ని రోజులుగా అమ్మడు మానసిక సమస్యలతో బాధపడుతోందంటూ వరుసగా తెలుగు మీడియా వెబ్ సైట్స్ లో వార్తలు వచ్చాయి. దీంతో ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది అంటూ చికిత్స తీసుకుంటోందంటూ ఎవరికి తోచినట్లు వాళ్ళు రాయడంతో శృతికి కోపం వచ్చింది.
తన సోషల్ మీడియా వేదికగా అలా రాసిన వారందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. నా జలుబు సమస్యను మానసిక అనారోగ్యంగా చిత్రీకరించారు, అదంతా తప్పుడు ప్రచారం అంటూ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. మానసిక సమస్యల గురించి మాట్లాడటానికి నేను భయపడను అంటూ నా సమస్యను దారుణంగా చిత్రీకరిస్తున్నారు, నన్ను నేను బాగా చేసుకోగలను అలాగే మానసికంగా నేను దృడంగా ఉన్నాను, మీకు అలాంటి సమస్యలు ఉంటే థెరపిస్ట్ ను సంప్రదించండి అంతే కానీ ఇలా చేయొద్దు. మరొకరిని చెడ్డగా చిత్రీకరించడం వల్ల మీరు మంచిగా అయిపోరు అంటూ ఘాటుగా స్పందించింది శృతి హాసన్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…