Hyper Aadi : జబర్దస్త్ కామెడీ షో తో మంచి రైటర్ గా కమెడియన్ గా ఎదిగిన హైపర్ ఆది పంచులకు ఫ్యాన్స్ ఎక్కువ. తన టైమింగ్ పంచులతో స్కిట్లను బాగా లేపుతాడు. స్కిట్లో కథ, లాజిక్ లేకపోయినా కేవలం ఆది పంచులతోనే హిట్ కొడతాడు. జబర్దస్త్, ఆ తరువాత ఎక్సట్రా జబర్దస్త్ ఇక ఆ తరువాత ఢీ డాన్స్ షో అలా అన్నింటా ఆది తన కామెడీ పంచులు సటైర్లతో అదరగొట్టాడు. ఇక సినిమాల అవకాశలు ఆదికి బాగా వచ్చాయి. కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ కూడా రాసాడు. ఇక చాలా సినిమాల్లో కమెడియన్ గా కుడా కనిపించాడు.
అన్నపూర్ణమ్మ పై పంచులు…
ఇక ఈమధ్యకాలంలో ఆది జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఇక ఢీ షో నుండి కూడా తప్పుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఫుల్ యాక్టీవ్ గా షోని రామ్ ప్రసాద్ తో కలిసి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో మరోసారి పుష్ప సినిమా స్పూఫ్ తో స్కిట్స్ చేసి నవ్వించాడు. ఆది పంచుల టైమింగ్ కి ఫ్యాన్స్ ఎక్కువ. ఇక పుష్ప సినిమా స్పూఫ్ జబర్దస్త్ లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో పుష్ప స్పూఫ్ లో శ్రీ వల్లి పాత్రను సీనియర్ నటి అన్నపూర్ణమ్మ చేసారు. ఈ మధ్యకాలంలో అన్నపూర్ణమ్మ ఈటీవీ ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. ఇక పుష్ప స్పూఫ్ లో తగ్గేదేలే అనే డైలాగు అన్నపూర్ణమ్మ చెప్పగానే ఆది ఎందులో ఆయాసంలోనా? అంటూ పంచ్ వేసి నవ్వించాడు.
అయినా ఇది పుష్ప నా లేకపోతే అమ్మమ్మ గారి ఇల్లు స్పూఫా అంటూ పంచ్ వేసాడు. ఇక మళ్ళీ అన్నపూర్ణమ్మ ఇప్పటికీ నా అందం చెక్కు చెదరలేదు తెలుసా అంటే ఆది వెంటనే మల్లెమాల తో చెక్కులు తీసుకుంటే మాత్రం ఇలాంటి డైలాగులు చెప్పడానికి మనసెలా వచ్చింది అంటూ అనగానే అందరూ నవ్వేశారు. ఇక ఈ షోలో 75 ఎపిసోడ్ సందర్బంగా ప్రేమ కావాలి హీరోయిన్ ఇషా చావ్లా సందడి చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…