Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు. ఈయన కమెడియన్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన బుల్లితెర కార్యక్రమాలలో మాత్రమే కాకుండా వెండితెర సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటు ఉన్న సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ ఉన్నటువంటి హైపర్ ఆది ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలిపారు.
తాను హైదరాబాద్ వచ్చిన మొదట్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. హైదరాబాద్ వచ్చిన మొదటిలో ఎక్కడ ఉండాలో తెలియక మా బంధువులు ఒకరు లేడీస్ హాస్టల్ పెడితే నేను ఆ హాస్టల్లోనే ఉన్నానని తెలిపారు. పైనంతా అమ్మాయిల హాస్టల్ ఉండేది కింద ఒక చిన్న గది ఉండడంతో ఆ గదిలో నేను ఉండే వాడినని ఆది తెలిపారు.
అయితే అక్కడ ఉండడం తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఉండాల్సిన పరిస్థితి అని తెలిపారు. అమ్మాయిలంతా భోజనం చేయడానికి కిందికి వస్తే తనకు ఎంతో సిగ్గుగా అనిపించేదని నేనేంటి ఇలా అమ్మాయిల హాస్టల్ లో ఉండడమని చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపారు. అమ్మాయిలు మెస్ కి వస్తారని తెలిసి తాను బయటకు వెళ్లిపోయే వాడినని వారంతా భోజనం చేసి వెళ్లిపోయిన తర్వాత తిరిగి నా గదికి వెళ్లే వాడినని తెలిపారు.
అవమానంగా అనిపించేది.
ఇలా అక్కడే ఉంటూ తాను జబర్దస్త్ కార్యక్రమంలో స్క్రిప్ట్ రాస్తూ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాను అయితే తను సెకండ్ లీడ్ కి వచ్చిన తర్వాత హాస్టల్ నుంచి కూడా బయటకు రావడం అప్పుడప్పుడే కాస్త క్రేజ్ సొంతం చేసుకొని టీం లీడర్ గా మారిపోవడం వంటివి జరిగాయి అంటూ ఈ సందర్భంగా హైపర్ ఆది చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…