Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆది ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకొని సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఆది కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తరచు ఈయన పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి.
ఈ సందర్భంగా హైపర్ ఆది పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండడంతో తరచూ ఈయన పెళ్లి గురించి వార్తలు వినపడుతుంటాయి. అయితే తాజా సమాచారం ప్రకారం హైపర్ ఆది పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ఓ వార్త సంచలనంగా మారింది. హైపర్ ఆది ప్రేమ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఇండస్ట్రీ లోకి వచ్చిన సమయంలో ఒక యూట్యూబ్ యాంకర్ తనకు చాలా అండగా నిలబడి తాను బుల్లితెరపై సక్సెస్ సాధించడానికి దోహదపడ్డారట.ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ పరిచయం ప్రేమగా మారింది అయితే వీరి ప్రేమ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ఇలా రెండు కుటుంబాల నుంచి అనుమతి రావడంతో హైపర్ ఆది త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా వీరిద్దరి పెళ్లికి ఒప్పుకోవడంతో త్వరలోనే నిశ్చితార్థం చేసుకుని అనంతరం ఘనంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు హైపర్ ఆది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈయన పెళ్లి చేసుకోబోయే ఆ యూట్యూబ్ యాంకర్ ఎవరు ఏంటి అనే విషయాలన్నింటిని కూడా ఈయన త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…