Hyper Adhi : ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కి ఎంత క్రేజ్ ఉందొ అలాగే డాన్స్ షోలలో ఢీ షో కి అంతే క్రేజ్ ఉంది. ఒకప్పుడు డాన్స్ షో అంటే డాన్స్ షోలా ఉండేది అయితే కాలం మరే కొద్ది ప్రేక్షకుల అభిరుచులు మారుతాయి. ఢీ షోలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలనే ఉదేశ్యంతో సుధీర్,రష్మిలను ఢీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కి లీడర్స్ గా పెట్టి ప్రదీప్, సుధీర్, రస్మిలతో మధ్యలో చిన్న చిన్నస్కిట్లు చేస్తూ ఎంటర్టైన్ చేసేవాళ్ళు. దీనివల్ల ఢీ షో టీఆర్పి బాగా పెరిగింది. ఇక పోయిన సీజన్ లో రష్మీ సుధీర్ లతో పాటు ఆది ని కూడా షోకి తీసుకున్నారు. ఫుల్ అఫ్ ఫన్ గా అన్నట్టు షో నడిచింది. ఇక ఈ సీజన్ లో సుధీర్, రష్మీ ఇద్దరు షో కి గుడ్ బై చెప్పేసారు. కేవలం ఆది, ప్రదీప్ లు షో ని నెట్టుకోస్తున్నారు. మధ్యలో కొన్నిరోజులు అఖిల్ సార్థక్ వచ్చిన మళ్ళీ బిగ్ బాస్ ఆఫర్ రావడంతో వెళ్ళిపోయాడు. ఇక సుధీర్, రష్మీ లు లేని లోటు షోలో బాగా తెలుస్తోంది.
డబల్ మీనింగ్ డైలాగులతో ఆది…
ఇక షోలో ఆది, ప్రదీప్ కి తోడుగా నవ్య స్వామి, రవి కృష్ణ లను ఢీ షోకి తీసుకున్నారు. కానీ ముందులాగా ఇపుడు రేటింగ్స్ ఢీ షోకి లేవు. దారుణంగా పడిపోయాయి. ఇక ఆది యదేచ్చగా డబల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నాడు. ఇక తాజాగా విడుదలైన ఢీ ప్రోమోలో స్కిట్ల పేరుతో కామెడీ చేయమంటే డబల్ మీనింగ్ డైలాగులు, బూతులతో రెచ్చిపోయాడు. ఇక ఆది జోకులకు జడ్జెస్ పడి పడి నవ్వడం మరో వింత.
చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటి బూతు జోకుల వల్ల షో చూడడం మానేశారు. హాస్యం అంటే బూతులు, డబల్ మీనింగ్ డైలాగులే అన్నట్టుగా అర్థాలను మార్చేస్తున్నారు కొంతమంది కమెడియన్స్. ఆరోగ్యవంతమైన కామెడీని పండించలేక ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పటికైనా ఈటీవీ యాజమాన్యం మేల్కొని ఇలాంటి అభ్యంతరకర కామెడీ గురించి ఆలోచిస్తే మంచిదని లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ మెల్లగా దూరమైపోతారని చాలా మంది నెటిజన్స్ అభిప్రాయం పడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…