Jr NTR: జీవితంలో అన్నీ ఉన్నా ఆ కోరిక మాత్రం తీరలేదట.. ఆ విషయంలో అసంతృప్తిగా ఉన్న తారక్!
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఈయన మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వృత్తిపరమైన జీవితంలో ఎన్టీఆర్ ఎంతో విజయం సాధించి ముందుకు వెళ్తున్నారు.
ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితానికి వస్తే ఎన్టీఆర్ లక్ష్మీప్రణతిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరికీ అభయ్, భార్గవ్ ఇద్దరు పిల్లలు కలరు. ఇక ఎన్టీఆర్ కుటుంబంలో అన్ని సౌకర్యాలు, జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఎన్టీఆర్ కూడా నిత్యం తన కొడుకులతో గడుపుతున్న క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.
ఈ విధంగా ఎన్టీఆర్ తన వృత్తిపరమైన జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంది.ఇలా జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కు ఒక విషయంలో మాత్రం తీరని కోరిక అలాగే ఉందని ఆ విషయంలో ఎన్టీఆర్ ఇప్పటికీ అసంతృప్తి పడుతుంటారని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ జీవితంలో తీరని ఆ కోరిక ఏమిటి అనే విషయానికి వస్తే…
ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి రెండవ సారి గర్భం దాల్చినప్పుడు ఎన్టీఆర్ తప్పకుండా తనకు కూతురే పుడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. ఈ విధంగా ఎన్టీఆర్ మాత్రమే కాకుండా తన కుటుంబం కూడా అమ్మాయి కోసం చాలా ఎదురు చూశారు. అయితే రెండవ సారి కూడా ఎన్టీఆర్ కి కొడుకు పుట్టడంతో ఎన్టీఆర్ కు కూతురు కావాలనే కోరిక అలాగే మిగిలిపోయింది. ఇలా రెండోసారి కూతురు పుడితే నందమూరి వంశానికి ఒక ఆడపడుచు ఉంటుందని ఆశ పడ్డారట. అయితే ఆ ఆశ, కోరిక అలాగే మిగిలిపోయాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…