Actor Naresh: నేనింకా ఆయనకు విడాకులు ఇవ్వలేదు.. నరేష్ మూడవ భార్య రమ్య కామెంట్స్ వైరల్?
Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొంతకాలం నుంచి పెళ్లి విడాకులు సహజీవనం అంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఇక ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆ పెళ్లిళ్లు కాస్త పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
ఇక వీరి గురించి వస్తున్న ఈ వార్తలపై పవిత్ర లోకేష్ స్పందిస్తూ మీ ఇద్దరి సహజీవనానికి కృష్ణ ఫ్యామిలీ అనుమతి కూడా ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో నరేష్ మూడో భార్య రమ్య ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేష్ ఇప్పటికీ తన భర్త అని స్పష్టం చేశారు. ఇంకా మా ఇద్దరికీ విడాకులు రాలేదని రమ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నటుడు నరేష్ తో తనకి ఇంకా సంబంధం తెగిపోలేదని మా ఇద్దరికీ ఇంకా విడాకులు రాలేదని,తాను ఇప్పటికీ విడాకుల పేపర్లపై సంతకం పెట్టలేదు కనుక తను నా భర్త అని చెప్పుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదని రమ్య వెల్లడించారు. ఇకపోతే పవిత్ర లోకేష్ రమ్య గురించి కూడా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తను నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమాత్రం లేదని తన కుటుంబం గురించి తాను చూసుకుంటే మంచిదని తెలిపారు.
తను రఘువీరా రెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తాను ఎప్పుడు కూడా తన కుటుంబం గురించి ఎక్కడ ప్రస్తావించలేదని ఈ సందర్భంగా రమ్య నరేష్ తో ఉన్న బంధం గురించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక రమ్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమ్య వ్యాఖ్యలపై నరేష్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…