Categories: FeaturedMovie News

Avinash:10 లక్షలు ఇచ్చాకే వదిలిపెట్టారు.. మల్లెమాల పై ముక్కు అవినాష్ షాకింగ్ కామెంట్స్!

Avinash: ముక్కు అవినాష్ పరిచయం అవసరంలేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటూ స్టార్ మా లో ప్రసారమయ్యే కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇలా శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించే స్టార్ మా పరివార్ నీతోనే డాన్స్ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్న అవినాష్ దావత్ కార్యక్రమానికి వచ్చారు.

ఈ కార్యక్రమానికి రీతు చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ముక్కు అవినాష్ మాట్లాడుతూ మల్లెమాల వారిపై ఆరోపణలు చేశారు.. జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న అవినాశ్ జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం ఏంటని రీతు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అవినాష్ సమాధానం చెబుతూ నేను జీవితంలో ఇంకా ఎదుగుదలను కోరుకున్నాను అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. ఇక జబర్దస్త్ కార్యక్రమం నుంచి నేను బయటకు రావాలి అనుకున్న సమయంలో మల్లెమాలవారు పది లక్షల రూపాయల ఫైన్ కడితేనే బయటకు పంపిస్తామని తెలిపారు.

కరోనా సమయంలో నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆ సమయంలో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారు కానీ నాకు బిగ్ బాస్ అవకాశం రావడం సంతోషం అనిపించింది బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలి మల్లెమాల వారితో ఉన్న కమిట్మెంట్ పూర్తి కాలేదు దాంతో ఫైన్ కట్టమన్నారు. ఆ సమయంలో శ్రీముఖి నా ఫ్రెండ్స్ 10 లక్షలు సహాయం చేశారని తిరిగి వారి డబ్బు వాళ్లకి ఇచ్చానని తెలిపారు.

బిగ్ బాస్ పునర్జన్మ ఇచ్చింది..

ఇక జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్నించగా ఎవరైనా జీవితంలో ముందుకు వెళ్లాలనుకుంటారు కానీ వెనక్కి తిరిగి వెళ్లాలనుకోరు నాకు బిగ్ బాస్ కార్యక్రమం పునర్జన్మ ఇచ్చిందని ఈ కార్యక్రమాల ద్వారా నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి అంటూ అవినాష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago