Categories: FeaturedMovie News

ధోనీతో నా ప్రేమ జీవితంలో ఒక మచ్చ.. ఆ కారణంతోనే విడిపోయాం: లక్ష్మి రాయ్

మహేంద్ర సింగ్ ధోనీ.. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెట్ కెప్టెన్‌లలో ఒకరు. ఇండియాకు అతడి కెప్టెన్ లో రెండు సార్లు వరల్డ్ కప్ ను అందించాడు. అంతటి చరిత్ర మహేంద్ర సింగ్ ధోనికి ఉంది. అతడి ఆటలో కూడా ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ఇక అతడు గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు.

ధోని పెళ్లి చేసుకోవడానికి ముందు.. అతడు కొంతమందితో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు , పుకార్లు వచ్చాయి. నటి రాయ్ లక్ష్మితో ఎంఎస్ ధోని డేటింగ్ వెళ్లినట్లు కూడా పుకార్లు వచ్చాయి. 2008-2009 సమయంలో ఈ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో వీరిద్దరు కలిసినప్పుడు తరచుగా మీడియా కంట పడేవారు. దీంతో వారిద్దరి మధ్య రిలేషన్ నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచాక.. ఆ టీం సభ్యులు అంతా ఓ పార్టీ చేసుకున్నారు. అందులో చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడు సురేష్ రైనాతో కలిసి ఆమె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు ధోని. ఎందుకంటే.. ఆసమయంలో రాయ్ లక్ష్మీ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఇలా ఆమె ధోనికి ఆ సమయంలో దగ్గర అయ్యారు. తర్వాత ధోని పెళ్లి చేసుకొని.. ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. కానీ రాయ్ లక్ష్మి మాత్రం ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఓ ఇంటర్వ్యూలో ధోనికి.. అమెకు ఉన్న సంబంధం గురించి ఓపెన్ అయ్యారు.

“ధోనీతో నా సంబంధం ఒక మచ్చ లాంటిదని.. అది చాలా కాలం వరకు పోలేదని.. తాము విడిపోయిన 12 ఏళ్లు అవుతున్నా ఇంకా దాని గురించే మాట్లాడటంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంవత్సరం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత ధోని, తాను సామరస్యంగా విడిపోవాలని అనుకున్నట్లు రాయ్ లక్ష్మీ స్పష్టం చేసింది. ఎలాంటి గొడవలు లేకుండా బ్రేకప్ చెప్పుకొన్నట్లు వెల్లడించింది. బ్రేకప్ జరిగినా తమకు ఒకరిపై మరొకరికి రెస్సెక్ట్ ఉందని పేర్కొంది. ధోనితో బ్రేకప్ తర్వాత తన లైఫ్ లో ఇలాంటివి ఎన్నో జరిగాయని.. వాటి గురించి ఎవరూ మాట్లాడరని.. మీడియా సమావేశం పెడితే కేవలం ధోనితో సంబంధం గురించే మాట్లాడుతారని అసహనం వ్యక్తం చేశారు. ఆమె చివరిగా సిండ్రెల్లా ఔటింగ్, ఝాన్సీ IPS, ఆనంద భైరవి మరియు గ్యాంగ్‌స్టర్ 21 లో నటించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago