Manchu Lakshmi: ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య దూరం చాలా తగ్గిపోయింది.ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు వారి చిన్నప్పటి ఫోటోలను లేదా వారి తీపి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి కూడా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ సందర్భంగా లక్ష్మీ మంచు తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ..పెళ్లి కూతురిని మండపంలోకి తీసుకు రమ్మని చెప్పినప్పుడు తనకు చాలా భయం, కంగారు వేసిందని ఆ సమయంలో మండపం నుంచి పారిపోవాలని దారి కూడా వెతుక్కుంటున్నాను అంటూ ఈమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని ఈమె చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మంచు లక్ష్మి 2006 వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దంపతులు సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. మంచు లక్ష్మి తన కూతురుకి సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
లక్ష్మీ మంచు తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే ఎన్నో టీవీ షోలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మీప్రసన్న అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి,ఊకొడతారా ఉలిక్కి పడతారా వంటి చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఈమె మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…