Featured

JD Chakravarthy: నాగచైతన్య నటించిన ఆ సినిమాలో నేనున్నా…కానీ ఎవరికీ తెలియదు.. జె.డి.చక్రవర్తి షాకింగ్ కామెంట్స్!

JD Chakravarthy: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు జె డి చక్రవర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తాజాగా ఈయన బుల్లితెరపై ప్రసారమౌతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది వైరల్ గా మారింది. ఈప్రోమో లో భాగంగా జె.డి.చక్రవర్తి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

JD Chakravarthy: నాగచైతన్య నటించిన ఆ సినిమాలో నేనున్నా…కానీ ఎవరికీ తెలియదు.. జె.డి.చక్రవర్తి షాకింగ్ కామెంట్స్!

ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో నాగచైతన్య మొట్టమొదటిసారిగా నటించిన జోష్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. జెడి చక్రవర్తి వేదికపైకి రాగానే ఈ సినిమాలోని అన్నయ్యొచ్చినాడో పాటతో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ పాట అయిపోగానే ఎవరు ఈ పాట సజెస్ట్ చేసింది ఎవరు ఎవరికి అన్నయ్య అంటూ చెప్పగా వెంటనే రాంప్రసాద్ స్పందిస్తూ నా కెరీర్లో తొలి సినిమాలోని పాట అని చెప్పారు.

JD Chakravarthy: నాగచైతన్య నటించిన ఆ సినిమాలో నేనున్నా…కానీ ఎవరికీ తెలియదు.. జె.డి.చక్రవర్తి షాకింగ్ కామెంట్స్!

జోష్ సినిమాలో గోడ బ్యాచ్ ఉంటుంది అందులో నేను ఉన్నాను అంటూ రాంప్రసాద్ చెప్పగా అప్పటి నుంచి గోడ బ్యాచేనా అంటూ జె.డి.చక్రవర్తి తన పై పంచ్ వేశాడు.మీరు జోష్ లో ఉన్నారని చెప్పగానే నాకు చాలా బాధ కలిగింది అంటూ జె.డి.చక్రవర్తి చెప్పాగా… జనాలకు గుర్తు లేదు మీరు మరి గుర్తు చేయకండి అంటూ రాంప్రసాద్ చెప్పారు.

నేను చేసినట్టు ఎవరికీ తెలియదు….

ఈ క్రమంలోనే జెడి చక్రవర్తి మాట్లాడుతూ ఈ సినిమాలో నేను నటించినట్లు కూడా ఎవరికీ తెలియదు అంటూ తనపై తానే సెటైర్ వేస్తున్నారు. అయితే ఈ సినిమాలో జె.డి.చక్రవర్తి విలన్ పాత్రలో నటించారు. ఈయన విలన్ గా నటించిన తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ నాగచైతన్య కెరీర్ లో మొదటి సినిమానే ఎన్నో విమర్శలను ఎదుర్కొందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago