కరోనా సమయంలో చాలామంది రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇందులో కొంతమంది నాన్ వెజ్ తినని వారు డ్రై ఫ్రూట్స్ తింటూ వాళ్ల ఇమ్యూనిటీని పెంచుకుంటుంటే.. మరి కొందరు చికెన్, మటన్ తింటూ పెంచుకుంటున్నారు. అయితే చాలామంది మటన్ షాప్ కు వెళ్లినప్పుడు కిలో లేదు రెండు కిలోల మటన్ చెప్పి.. వాడు ఇచ్చింది తెచ్చుకుంటాం..కానీ కొంతమంది ఆ మటన్ ముదురుదా..లేతదా అనేది ఆరా తీస్తారు.
ముదురుది, లేత అనేది ఎలా గుర్తు పట్టాలి.. వాటి కోసం ఏం చేయాలి ఇక్కడ తెలుసుకుందాం.. చికెన్ కంటే కూడా మటన్ తినడం చాలామంచింది. ఎందుకంటే.. అందులో ముఖ్యంగా విటమిన్ బి12 మటన్ ద్వారా ఎక్కువగా లభిస్తుంది. ముఖ్యంగా దుకాణాల్లో మనకు కనిపించే మటన్ అనేది లేత మటన్ అయితే.. లేత ఎరుపు రంగులో కనిపిస్తుంటుంది. అది ఒక వేళ ముదురు మటన్ అయితే మాత్రం డార్క్ రెడ్ లో కనిపిస్తుంది.
మటన్ పై కొవ్వు అనేది పసుపు లేదా బూడిద రంగులో ఉంటే మాత్రం అది ముదురు మటన్ అని.. కొవ్వు తెల్లగా, లేత పసుపు రంగులో ఉంటే అది లేత మటన్ అని మనం గుర్తించవచ్చు. లేత మటన్ నుంచి ఆ కొవ్వును సులువుగా తొలగించవచ్చు. ముదురు మటన్ నుంచి ఆ కొవ్వను తొలగించాలంటే సలుభంగా వేరు చేయలేము. అది చాలా గట్టిగా ఉంటుంది.
లేత మటన్ అనేది వాసన వస్తూ ఉంటుంది.. ముదురు మటన్ వాసన రాదు. సులభంగా గుర్తించే మరి కొన్ని చిట్కాలు ఏంటంటే.. మటన్ పై వేలితో నొక్కితే సొట్టలు పడతాయి.. ఇలా ఏర్పడితే అది ముదురు మటన్ అని అర్ధం. పక్కటెముకలు చిన్నగా ఉంటే లేత మటన్ అని.. పెద్దగా ఉంటే ముదురు మటన్ అని గుర్తుంచుకోవచ్చు. అంన్నింటి కంటే మరో చిన్న చిట్కా ఏంటంటే.. తోక చిన్నగా ఉంటే లేతది అని.. పెద్దగా ఉంటే ముదురు మటన్ అని తెలుసుకోవచ్చు. ఇలాంటివి ఫాలో అయి లేత లేదా ముదురు మటన్ ను గుర్తించవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…