Director Maruthi: పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన అనంతరం కేరింత సినిమాతో నటుడు పార్వతీశం పరిచయమయ్యారు.ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రెండు సినిమాలలో నటించారు. మారుతి దర్శకత్వంలోనూ రోజులు మారాయి, భలే మంచి చౌక బేరం వంటి రెండు సినిమాలలో నటించినట్టు ఈయన తెలిపారు.
ఇకపోతే కేరింత సినిమాలో నటించడం కోసం పార్వతీశం దిల్ రాజుకు డబ్బులు ఇచ్చినట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి ప్రశ్నించగా దిల్ రాజు గారికి నేను డబ్బులు ఇవ్వడం ఏంటి అంటూ ఈయన ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఇకపోతే మారుతి గారు మీకు పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టారు అని కూడా వార్తలు వచ్చాయని ప్రశ్నించగా ఈ విషయం గురించి పార్వతీశం క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలలో ఒక్కరు కూడా పేమెంట్ ఎగ్గొట్ట లేదని మారుతి గారు కూడా ఎప్పుడూ తనని పేమెంట్ కోసం ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఇక మారుతి గారి ప్రొడక్షన్ లో చేసిన ఈ రెండు సినిమాలకు కూడా ఆయన కరెక్ట్ గా పేమెంట్ ఇచ్చారని తెలిపారు. ఇక సార్ పేమెంట్ కావాలని అతనికి చిన్న మెసేజ్ చేస్తే చాలు గంటలో నా అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయని తెలిపారు.
ఒకవేళ క్యాష్ కనుక ఉంటే ఆఫీస్ కి వెళ్లి తీసుకో అంటూ తనకు సమాధానం చెబుతారు కానీ ఆయన పేమెంట్ విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఇక చోటా కె నాయుడు గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో మంచివారని ఆయన స్టైల్, ఆయన డిగ్నిటీ ఎంతో బాగుంటుందని ఈ సందర్భంగా నటుడు పార్వతీశం చోటా కె నాయుడు గురించి తెలిపారు.తను ఒకసారి ఎవరైనా ఇష్టపడితే ఎంతో ప్రేమగా చూసుకుంటారని అంత మంచి మనస్తత్వం అని పార్వతీశం ఈ సందర్భంగా చోటా కె నాయుడు గురించి తెలిపారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…