YS Sharmila: వైయస్ షర్మిల గత ఎన్నికలకు ముందు తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్నయ్య గెలుపుకు ఎంతో కారణం అయ్యారు కానీ ఈ ఎన్నికల సమయానికి ఈమె తన అన్నకు పోటీగా ఎన్నికల బరిలోకి దిగి సంచలనం సృష్టిస్తున్నారు. వైయస్ షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నటువంటి షర్మిల అప్పటినుంచి ఏపీలో విస్తృతంగా పర్యటనలు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైయస్ షర్మిల తాజాగా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు. ఒక్క హామీ కూడా నెరవేర్చనటువంటి జగన్ వైయస్ వారసుడు ఎలా అవుతారంటూ ఈమె ప్రశ్నించారు.
వైయస్సార్ హయామంలో వ్యవసాయం అంటే ఒక పండుగలాగా ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి తాను వైయస్సార్ వారసుడు అని చెప్పుకుంటూ చేస్తున్నటువంటి ఈ పాలనలో అప్పు లేని రైతు లేరని ఈమె తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి అంటూ అందరిని మోసం చేశారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా జాబ్ నోటిఫికేషన్ లేకుండా చేశారు.
ప్రత్యేక హోదా తీసుకువస్తా..
నేను వైఎస్ఆర్ బిడ్డ.. పులి బిడ్డ. నా గుండెలో దమ్ముంది. న్యాయం కోసం ఎంపీగా పోటీ చేస్తున్నా. మళ్ళీ నిందితుడికి ఎంపీ సీట్ ఇవ్వడం అన్యాయం. మీరు న్యాయం వైపు ఉంటారో అన్యాయం వైపు ఉంటారో మీరే తేల్చుకోవాలని ఈమె ప్రజలకు సూచనలు చేశారు. తాను ఇక్కడే పుట్టానని ఇక్కడే పెరిగానని మీ అందరి ఆడబిడ్డను తానని ఈమె తెలిపారు. మీ ఆడబిడ్డకు ఓట్లు వేసి గెలిపించండి అని కోరారు. నేను ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతానని తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని షర్మిలా తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…