Vitamin D: మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే… ఈ సమస్యలు తప్పవు!

Vitamin D: మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే… ఈ సమస్యలు తప్పవు!

Vitamin D: శరీర ఆరోగ్యం విషయంలో విటమిన్-డి ప్రాముఖ్యతను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విటమిన్ డి ఎక్కువగా ఉదయం పూట ఏర్పడే సూర్యకాంతి లో లభిస్తుంది. ఈ విటమిన్ డి ఎదిగే పిల్లలకు చాలా అవసరమని మనం వింటూ ఉంటాం. అలాంటి విటమిన్ డి మన శరీరంలో లోపిస్తే ఎలాంటి వ్యాధులు తలెత్తుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Vitamin D: మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే… ఈ సమస్యలు తప్పవు!
Vitamin D: మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే… ఈ సమస్యలు తప్పవు!

మన శరీరంలో విటమిన్-డి లేకపోవడం వల్ల మొదటిగా మన ఎముకలు బలహీనతకు గురవుతాయి. తద్వారా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలకు దారితీస్తాయి. ఇక అంతే కాకుండా మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే గుండెజబ్బులు వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

Vitamin D: మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే… ఈ సమస్యలు తప్పవు!

కాబట్టి మన శరీరంలో విటమిన్-డి ఎంత పుష్కలంగా ఉంటే మన గుండె అంత దృఢంగా ఉంటుంది. ఇక మన శరీరంలో విటమిన్-డి లోపం రోగ నిరోధక శక్తి బలహీన పరచడాన్ని మరింత త్వరగా పూర్తి చేస్తుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ గల కారణం కూడా విటమిన్ డి లోపం అని చెప్పవచ్చు.

రక్తపోటు సమస్యకు కారణం…

ఇక విటమిన్ డి లోపం ఎక్కువగా ఉన్నవారికి మధుమేహం వచ్చే సమస్య కూడా ఉందని తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో షుగర్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల ద్వారా తెలుస్తుంది. ఇక రక్తపోటు వంటి సమస్యలకు కూడా విటమిన్ డి లోపం కొంతవరకూ కారణం అని తెలుస్తుంది. కాబట్టి మన శరీరానికి విటమిన్-డి కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది.