Tea: టీ తాగిన తర్వాత ఈ ఆహార పదర్థాలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!
Tea: మన నిత్య జీవితంలో ‘టీ’(TEa)కి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఉదయాన్నే కాసింత ఛాయ్ నోట్లో పడందే.. ఏ పని కూడా మొదలు కాదంటే అతిశయోక్తి కాదు. గంట గంటకు కూడా టీ తాగే వారు కూడా ఉంటారు. కొంత మందికి టీ వ్యసనం. ప్రస్తుతం ఛాయ్ లలో అనేక వెరైటీలు కూడా వస్తున్నాయి. అల్లం టీ, గ్రీన్ టీ, మసాలా టీ, తందూరి టీ ఇలా రకరకాల టీలు రావడంతో… ఛాయ్ ప్రియులు అన్నింటిన టెస్టుల చేస్తున్నారు.
ఇదిలా ఉంటే టీ తాగడం మంచిదా కాదా.. అనే ప్రస్తావన వస్తే కొన్ని సందర్భాల్లో టీ తాగడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలు జీర్ణం కావడాన్ని అడ్డుకోవడమే కాకుండా.. ఆహారంలోని పోషక విలువను శరీరం గ్రహించకుండా అవరోధాలు ఏర్పడుతాయని చెబుతున్నారు.
విలమిన్లు, ఖనిజాలు శోషణకు టీ అడ్డు తగులుతుందని తేలింది. ఛాయ్ లో ఉన్న టానిన్లు ముదురు గోధుమ రంగును అందిస్తాయి. అదే విధంగా గ్రీన్ టీలో క్యాటెచిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. టానిన్లు అధిక సాంద్రతలో ప్రోటీన్, ఐరన్ శోషనకు నిరోధిస్తోంది. ఇటు వంటి సమయంలో ప్రోటీన్లు తిన్న తరువాత టీ తాగకూడదు.
పచ్చి కూరగాయలు తిన్న తర్వాత కూడా టీ ని తాగకుంటే మంచిదని చెబుతున్నారు. ఆకుకూరల్లో ఉండే గోయిట్రోజెన్లు థైరాయిడ్ ద్వారా అయోడిన్ శోషణను నిరోధించి అయోడిన్ లోపానికి కారణం అవుతుంటాయి. పచ్చి కూరగాయలు తిన్న తర్వాత కూడా టీ ని తీసుకోవడం మానేయాలి. తృణధాన్యాలు, మిల్లెట్స్ లో ఫైటేల్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇనుము, జింక్, మెగ్నీషియంతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీ తాగిన తర్వాత మొలకలను తినకూడదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…