Categories: FeaturedGeneral News

మీ ఇల్లు ఇలా ఉంటే లక్ష్మీ దేవి తాండవం చేస్తుంది…!! ఎలానో చుడండి..!!

లక్ష్మీ దేవి మీ ఇంట్లో తాండవించాలంటే ఏం చెయ్యాలి.? డబ్బు ఎప్పుడు మీ వద్ద ఉండాలంటే మీ ఇంట్లో ఆటంకాలు పరిచే కొన్ని వస్తువులను, కొన్ని అలవాట్లను మార్చాలి. మనం నివశించే ఇంటి విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానివలన మన జీవితం ఎంతో ఆనందంగా, సిరిసంపదలతో ఉంటుంది. ఫలితంగా లక్ష్మీ దేవి ఎప్పుడు మీ వద్ద ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సకల దేవుళ్లలో ముందుగా ప్రార్థించాల్సింది వినాయకుడికి. కాబట్టి గణపతిని ఎప్పటికి మరువకూడదు. పూజ మందిరంలో ఉన్న గణేశునికి రోజూ భక్తి శ్రద్ధలతో పూలు సమర్పించాలి. కాని కొన్ని ఇళ్లల్లో చాలా రోజుల పాటు పూజ మందిరానికి అలంకరించిన పూలు, పూజలో వాడిన పుష్పాలను అలాగే ఉంచేస్తారు. ఈ పద్ధతి సరికాదు. వీలైనంత త్వరగా వాటిని తొలగించాలి. వాడిపోయిన పూలు ఇంట్లో ఉన్నాయంటే ఇంట్లో డబ్బు నష్టపోతామని అర్థం చేసుకోవాలి.

మనం నివశించే ఇంటి సింహ ద్వారం, మన పేరుని బట్టి లేదా మనం పుట్టిన తేదీనిబట్టి మనకు అనుకూలమైన విధంగా ఉండాలి. అలా ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది. మన పేరుని బట్టి లేదా మనం పుట్టిన తేదీనిబట్టి మనకి నప్పని సింహాద్వారంలో ఉండటం వలన ఆర్ధికంగా, ఆరోగ్యంగా కొన్ని సమస్యలు వస్తాయి. సింహ ద్వారానికి అటు ఇటు కిటికీలు ఉండాలి. లేదంటే కనీసం ఒక వైపైనా కిటికీ ఉండాలి. ఇలా ఉండటం వలన ఐశ్వర్యం కలుగుతుంది.

చాలా మంది ఇంట్లో వాటర్ ట్యాప్ ను కట్టివేయకుండా అలాగే వదిలేసి వెళ్తుంటారు. నీటిని వృధా చేయడం వల్ల లక్ష్మీ మీ వద్ద ఉండదు. ఎందుకంటే నీరు ఈ జగతికి దాహార్తిని తీసే అమూల్యమైన వనరు. అందువల్లే లక్ష్మీ దేవికి ఈ విధంగా నీటిని వృథా చేయడం ససేమిరా ఒప్పుకోదు. అవసరాలకు నీటిని ఉపయోగించుకున్న వెంటనే ఎప్పటికప్పుడు వాటర్ ట్యాప్ ఆఫ్ చేయాలి. నీటి పంపు నుంచి బిందువులు మాదిరి నీరు కిందకు పడుతుందంటే దానర్థం.. మీ వద్ద డబ్బు కూడా అలాగే అయిపోతుందనడానికి సంకేతం. కాబట్టి నీటిని వృథా చేయడం మానుకోవాలి.

ఇంట్లో పావురాలు గూళ్ళు కట్టకూడదు. అలాగే గబ్బిలాలు తిరగకూడదు. దీని వలన ఆ ఇంటి యజమానికి ఆయుష్షు తగ్గుతుంది.

ఇంటి తలుపులు తెరిచేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు శబ్దం చేయడం మంచిది కాదు. ఫలితంగా మీ ఇంట్లో తగాదాలకు కారణమవుతుంది. తలుపులు విరిగిపోయితే వాటిని వీలైనంత త్వరగా మరమ్మతులు చేయాలి. తలుపులు తెరవడంలో మరియు మూసివేస్తున్నప్పుడు శబ్దం వస్తే తలుపు మధ్యలో నూనెను జోడించడం ద్వారా దాన్ని సరిచేయొచ్చు. ఈ కారణంగా మీ ఇంట్లో మనస్పర్థలు, కలహాలు వస్తుంటే వాటిని వీలైనంత వరకు రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.

ఆగ్నేయంలో వంటగది ఉంటే, ఆ ఇంట్లో వాళ్లకి ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా ఉంటుంది. ఉత్తరంలో నీటి కుళాయి, లేదా నీటి బిందెలు అయినా పెట్టుకుంటే మంచిది.

మీ ఇంటిలో ఉన్న గోడల్లో పగుళ్లు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే గోడలో చీలిక ఉంటే మీ బంధంలోనూ పగుళ్లు ఉంటాయనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ మీ ఇంటి గోడల్లో పగుళ్లు ఉన్నట్లయితే వాటిని వీలైనంత త్వరగా సరిచేయించాలి. పగుళ్లున్న గోడ సొమ్ము నష్టాన్ని సూచిస్తుంది. కాబట్టి గోడలు బాగా ఉన్న ఇంట్లో ఉండాలి. అలా కాదని గోడలు బీట్లు ఉన్న ఇంట్లో ఉంటే, ఇక ఆ ఇంట్లో ఆనందం అనేది ఉండదు. అందుకే లక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో కొలవడాన్ని ఎప్పుడు మరువకూడదు. ఇంట్లో ఎప్పుడు డబ్బు తాండవించాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించడం ఉత్తమం.

ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేకుండా, పాజటీవ్ ఎనర్జీ రావాలంటే తులసి మొక్కను పెంచాలి. ఇంట్లోకి గాలి వెలుతురు ప్రవేశించాలి. అలా లేని ఇంట్లో ఉండటం మంచిది కాదు.

ఇంటి ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు. కుబేరుడు డబ్బుకు చిహ్నం. కాబట్టి ఇంటి ఉత్తర దిశను ఎప్పుడూ మురికిగా ఉంచొద్దు. ఉత్తర దిక్కులో పూజలు చేయడం, ప్రతిరోజు దూపదీప నైవేధ్యాలతో స్వామిని కొలవడం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం.. చెత్తను ఈ దిశలో సేకరించడం మానివేయాలి. ఒకవేళ ఇలా చేసినట్లయితే ఇంట్లో అదనపు ఖర్చులు పెరుగుతాయి. డబ్బు వృథా అవుతుంది. ఫలితంగా లక్ష్మీదేవి ప్రసన్నం కాదు.

ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బొమ్మలు, గాజు వస్తువులు ఎక్కువగా పగులుతుంటాయి. అయితే వీలైనంత వరకు ఇలా జరగనివ్వకూడదు. పగిలిపోయే వస్తువులకు పిల్లలను దూరంగా ఉంచండి. ఎందుకంటే విరిగిన బొమ్మలు, వస్తువులు పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అంతేకాకుండా మీ డబ్బు కూడా వృథా అవుతుంది. వీటితో పాటు విరిగిన బొమ్మలు, పేలిన టపాకాయలు లాంటి వాటిని వీలైనంత త్వరగా తొలగించాలి. ఇంట్లో బూజులు ఉండకూడదు. ప్రతీ బుధవారం ఇంటిని శుభ్రపరచుకుంటే మంచిది. వీటిని లక్ష్మీ దేవి శుభంగా పరిగణించదు. ఇంట్లో ప్రతీ గదిలో కూడా వస్తు ప్రకారం వస్తువులను అమర్చుకోవాలి. ఇలాంటి ఇంట్లో ఉంటె మీకు అదృష్టం కలసి వస్తుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago