Jr.NTR: తారక్ పెట్టుకున్న కొత్త వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన RRR చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం మొత్తం సక్సెస్ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం ముంబై లో జరిగిన సక్సెస్ పార్టీలో సందడి చేశారు.
ఈ సక్సెస్ పార్టీలో ఎన్టీఆర్ చేతి వాచీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతే కాకుండా పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ చేతికి ఉన్న ఆ వాచి ఏ కంపెనీది, దాని ధర ఎంత?వాటి గురించి ఆరా తీయగా ఎన్టీఆర్ చేతికి ఉన్న ఆ వాచీ ధర దాదాపుగా కోటిన్నరకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
ఆ వాచ్ పేరు Patek Philippe Nautilus 5712 1/A. అయితే ఈ వాచ్ ని సొంతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్ దాదాపుగా కోటి 70 లక్షలకు పైగానే ఖర్చు చేసినట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు కార్లన్న వాచీలన్నా ఎక్కువ ఇష్టం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ తో పాటుగా అలాంటివి ఇంకా చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ ధరించిన ఆ బ్రాండ్ లో లభించే ప్రతి ఒక్క వాచ్ కూడా చాలా ఖరీదైనదే.
ఇకపోతే కరోనాకి ముందు జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ ను ధరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ ధరించిన ఆ ఖరీదైన వాచ్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. రిచర్డ్ మిల్లే RM కి చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ అనే బ్రాండ్ వాచ్ ను ధరించారు ఎన్టీఆర్. అయితే ఆ వాచ్ ధర దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు. ఇకపోతే మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లను సాధించింది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో సక్సెస్ పార్టీ నిర్వహించారు మూవీ మేకర్స్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…