ముఖం అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అటు పురుషులు అయినా ఇటు మహిళలు అయినా ఫేస్ మంచిగా ఉంటేనే ఎదటి వారు మనల్ని చూసే విధానంలో మార్పు ఉంటుంది. అందుకే ఈ అందమైన ముఖం సొంతం చేసుకోవడానికి దానికి ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనకాడరు.
ఇప్పటికే మహిళలకు, పురుషులకు బయట దొరికే ఎన్నో క్రీమ్ లు, ఫేస్ వాష్ కు సంబంధించిన ఎన్నో రకాల ఐటెంలు ఉన్నాయి. వాటిని ముఖానికి అప్లై చేస్తూ మేకప్ వేసుకుంటారు. అయితే కొంతమందికి ఇలా ముఖానికి ఎన్నిపూసినా.. ముఖం మాత్రం అందంగా తయారవదు. ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలు కూడా కనపడి.. చూడటానికి అంద విహీనంగా ఉంటారు.
అయితే కింద చెప్పిన చిట్కా వాడితే ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది. ఈ చిట్కాకు ఉపయోగపడేవి ఏంటంటే.. పసుపు, రోజ్ వాటర్. పసుపును పురాతన కాలం నుంచి కూడా సౌందర్య రక్షణలో ఉపయోగిస్తున్నాం.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక స్పూన్ పసుపులో రెండు స్పూన్ల రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేయాలి.
ఇలా చేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ముఖంపై మసాజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే ఫలితం ఉంటుందని.. ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు అనేవి ఉండవని నిపుణులు చెబుతున్నారు. రోజ్ వాటర్ లో ముఖంపై ఉండే చెడు వ్యర్థాలను తొలగించే గుణం ఉంటుందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…