Kriti Sanon: నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు.. బాడీ షేమింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి సనన్!
Kriti Sanon:మహేష్ బాబు హీరోగా 1నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత దోచేయ్ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినీ ఇండస్ట్రీలో చేదు అనుభవం ఎదురవడంతో బాలీవుడ్ బాట పట్టింది.
ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న కృతిసనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్న కృతిసనన్ కెరియర్ మొదట్లో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొనడం ముఖ్యంగా తన బాడీ షేమింగ్ గురించి ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా బయటపెట్టారు.
ఈ సందర్భంగా కృతిసనన్ మాట్లాడుతూ.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు నవ్వుతూ కనిపించే ఈ హీరోయిన్ నవ్వు ఏ మాత్రం బాగుండదని చాలామంది కామెంట్లు చేశారని తెలిపారు.ఈ క్రమంలోనే చాలా మంది పెదాలకు సర్జరీ చేయించుకోవచ్చు కదా అంటూ సలహాలు కూడా ఇచ్చారని తెలిపారు.
ఈ విధంగా నా నవ్వు గురించి నా పెదాల గురించి కామెంట్లు చేయడమే కాకుండా నా ముక్కు బాగాలేదని, నవ్వితే నాసికా రంధ్రాలు ఎర్రబడతాయి అని చాలా మంది అవహేళన చేస్తూ తనకు సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారని తెలిపారు. అయితే నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా అనుకొని వారందరి మాటలు పట్టించుకోలేదని అయినా నాకు నాలా ఉండటమే ఇష్టం అని ఈ ముద్దుగుమ్మ తెలిపారు.ఎవరో వచ్చి ఏదో చెబితే వారికి నచ్చిన విధంగా మనం ఉండాల్సిన అవసరం లేదని ఇదే విషయాన్ని అతను అందరికీ తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…