Categories: FeaturedMovie News

Imandi Ramarao : చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను కోటా శ్రీనివాసరావు టార్గెట్ చేయడానికి కారణం అదే… కోటా మాట తీరు ఎలా ఉంటుందంటే : ఇమంది రామారావు

Imandi Ramarao : విలన్ గా కామెడీ విలన్ గా అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు 750 సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. బాబు మోహన్ కోటా గారి కాంబినేషన్ అంటే ఆ రోజుల్లో సినిమాకు మినిమమ్ గ్యారెంటీ అనేంతలా వారి పాత్రలు ఉండేవి, కామెడీ పండేది. ఇక సీరియస్ విలన్ గా కూడా రాణించిన కోటా గారు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యే గా పనిచేసారు. ఇక ఇపుడు వృద్ధాప్య సమస్యలతో సినిమాలలో పెద్దగా కనిపించని కోటా గారు ఇండస్ట్రీ గురించి ఇప్పటి తరం నటుల గురించి ఆయన అభిప్రాయాలను చెబుతూ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. ఇక వీటిపై మెగా అభిమానులు కోటాను ట్రోల్స్ కూడా చేశారు. ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ ఆయన బిహేవియర్ ఎలా ఉండేదో చెప్పారు.

కోటా శ్రీనివాసరావు ఎక్కడో హర్ట్ అయ్యారు అందుకే…

ఇమంది రామారావు గారు మాట్లాడుతూ కోటా శ్రీనివాసరావు గారు నోరు ఆగేది కాదని తిట్టడం, ఎదుటివారిని విమర్శించడం ముందు నుండి ఉందని చెప్పారు. ఇలాటి బిహేవియర్ వల్ల కోటా చాలా మందికి ఇండస్ట్రీ లో దూరమాయ్యాడు అలాగే గొడవలు, అవకాశాలు కోల్పోవడం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఇక కోటా గారు అలా ఎదుటివారిని మాట్లాడి గొడవలు పడినా మళ్ళీ తిరిగి వారితో సఖ్యతగా ఉండే నేర్పరితనం ఉండేదని చెప్పారు.

అయితే ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్నా ఇండస్ట్రీ మీద ఆసక్తి పోలేదని అందుకే ఇప్పటికీ అందరి గురించి అడిగి తెలుసుకుంటూ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతుంటారు అని చెప్పారు ఇమంది రామారావు. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద విమర్శల గురించి మాట్లాడుతూ ఆయన సినిమా కెరీర్ లో ఎక్కడో చిరంజీవి వల్ల హర్ట్ అయినట్లున్నారు అందుకే అలా మాటాడుతున్నారు. పవన్ కళ్యాణ్ నటన ఇష్టం అంటూ చెప్పే ఆయన పవన్ వ్యక్తిత్వాన్ని మాత్రం విమర్శిస్తారు అంటూ ఆయన ఎక్కడో హర్ట్ అయినట్లున్నారు అందుకే అలా మాట్లాడుతున్నారు. అనారోగ్య సమస్యలతో వృద్ధాప్యంలో ఆయన మాటలను పట్టించుకోకపోవడం మంచిది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago