Imandi Ramarao : సినిమాల్లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే అభిమానులు అందరు హీరోలకు మామూలే. ఒరేయ్ నాయనా మేము మేము బాగానే ఉన్నాం, మీరు ఇలా కొట్టుకోకండి అంటూ ప్రతిసారి హీరోలు చెప్తూనే ఉన్నా అభిమానులు మాత్రం మారరు. ఇంతకు ముందు ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ వంటి దిగ్గజ నటులు కలిసి సినిమాల్లో నటించారు. ఎటువంటి బేషజాలకు పోకుండా నటించారు. కానీ తొంభై దశకంలో అలాంటి పరిస్థితి లేదు ఒక హీరో సినిమాలో ఇంకో పెద్ద హీరో నటిస్తే ఒకరిని ఎక్కువ చూపించి మరొకరిని తగిస్తే ఫ్యాన్స్ తో పడలేమని డైరెక్టర్లు సాహసించేసలేదు. ఇటీవలే రాజమౌళి తన సినిమాలో మెగాస్టార్ నందమూరి ని కలిపి తీసి రిస్క్ చేసాడు. అయినా కూడా మా హీరోని తక్కువ చేశారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గోల చేసారు. ఇదంతా పక్కన పెడితే ఫ్యాన్స్ మధ్య గొడవలు కామన్ మరి హీరోల మధ్య కుడా గొడవలు ఉన్నాయా అంటే మేము బాగున్నాం ఏమీ గొడవలు లేవని పైకి అందరు హీరోలు చెబుతారు. కానీ దిగ్గజ హీరోలైన చిరు, బాలయ్య మధ్య గొడవలు ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్ ఇమంది చెబుతున్నారు.
అన్ స్టాపబుల్ కి చిరు వస్తాడా ??
చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ టాలీవుడ్ టాప్ హీరోస్. ఇద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు, ఫ్యాన్స్ కొట్టుకున్న సందర్భాలు బోలెడు ఉన్నాయి. అయితే అవన్నీ ఫ్యాన్స్, సినిమాల వరకే వ్యక్తిగతంగా ఇద్దరూ చాలా చక్కగా ఉంటారు. మంచి రిలేషన్ కలిగి ఉన్నారు ఇది ఇండస్ట్రీ లో వినిపించే మాట. కానీ వాళ్ళ మధ్య కూడా అభిప్రాయ బేధాలు ఉన్నాయని కాకపోతే మరీ గొడవలు పడేంత కాదని ఇమంది రామారావు అభిప్రాయపడ్డారు. ఇక బాలకృష్ణ తొలిసారి సినిమాలు కాకుండా ఓటీటీ లో చేస్తున్న షో ‘అన్ స్టాపబుల్’, ఈ షో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు.
నిజానికి బాలయ్యబాబు సినిమాలో డైలాగ్ లాగే ‘ఒన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్’ అన్నట్టు చరిత్ర సృష్టించింది. ఒక రకంగా ఆహా ఒరిజినల్స్ కి సబ్స్క్రయిబర్లు ఈ షో వల్ల పెరిగారు. అయితే సక్సెస్ ఫుల్ గా మొదటి సీజన్ అయిపోయింది. ఇక రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడో గాసిప్ బాగా ఇంట్రెస్ట్ క్రియేట చేస్తోంది. అదే చిరు ఈ సీజన్ లో షో కి వస్తాడని. సినిమాల్లో ఎలాగో కలిసి నటించలేదు అయితే షో లో అయినా మెగాస్టార్ నందమూరి ని ఒక ఫ్రేమ్ లో చూడాలని అనుకుంటున్నారు ఇరు వైపుల అభిమానులు. నిజంగా షో కి చిరు వస్తే ఇద్దరి మధ్య ఎలాంటి ఇగోస్ లేవని అందరికీ అర్థంవుతుంది అంటూ ఇమంది రామారావు అభిప్రాయపడ్డారు. మరి నిజంగా ఆ ఎపిసోడ్ ప్లాన్ చేస్తే ఫ్యాన్స్ కే కాదు తెలుగు ప్రేక్షకులకులందరికీ ఆనందమే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…