Bullet Bhaskar: వేదికపై బుల్లెట్ భాస్కర్ ను నిజంగానే కొట్టిన ఇమ్మానియేల్.. అసలేం జరిగిందంటే?
Bullet Bhaskar: బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా విపరీతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ప్రతివారం ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో బుల్లెట్ భాస్కర్ టీమ్ లో వర్ష, ఇమ్మానియేల్, ఫైమా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక పైమా ఉందంటే ఆ స్కిట్ మొత్తం రచ్చ రచ్చగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగ ఫైమా కొట్టే దెబ్బలకు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి. అయితే వీళ్లు స్టేజీపై నిజంగానే కొట్టుకోరనే సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది ఇందులో భాగంగా బుల్లెట్ భాస్కర్ సర్కారు వారి పాట సినిమా తీమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇందులో మహేష్ బాబు పాత్రలో బుల్లెట్ భాస్కర్ నటించగా అతనితో 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న వర్ష చెల్లించకుండా ఇమ్మానియేల్ ను పెళ్లి చేసుకుంటుంది. ఇకపోతే బుల్లెట్ భాస్కర్ భార్యగా నటించిన ఫైమా తనకు 10 లక్షలు కావాలని నిలదీయడంతో 10 లక్షలు అడగడం కోసం వర్ష దగ్గరకు వెళ్తాడు.వర్ష పెళ్లి చేసుకుందని తెలియడంతో తన డబ్బు ఇచ్చే వరకు తన ఇంట్లో పనిమనిషిగా ఉండాలని తనని తీసుకొచ్చి తన ఇంట్లో పనులు చేస్తుంటారు.
వర్షతో పాటు ఇమ్మానియేల్ కూడా వెనకాలే రావడం ఆపై వీరిద్దరి మధ్య మాట మాట పెరుగుతూ ఇమ్మానియేల్ బుల్లెట్ భాస్కర్ ను కొట్టాల్సి ఉంటుంది. అయితే స్కిట్ లో లీనమైపోయిన ఇమ్మానియేల్ నిజంగానే బుల్లెట్ భాస్కర్ ను కొడతాడు. అయితే స్కిట్ మధ్యలో ఆపకుండా తనకు సారీ చెబుతూ స్కిట్ కంటిన్యూ చేస్తారు. ఈ విధంగా ఇమ్మానియేల్ బుల్లెట్ భాస్కర్ నిజంగా కొట్టడంతో అక్కడ ఉన్న జడ్జెస్ సైతం ఒక్కసారిగా షాక్ అవుతారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…