అతడి కళాఖండాలు అద్భుతం.. వణికే వ్యాధి ఉన్నా ప్రతిభ అమోఘం..

ఏ పని చేయాలన్నా మనం ఆరోగ్యంగా ఉంటేనే చేయగలం. అలాంటిది వణికే వ్యాధి ఉంటే..చేసే పని చేయడంలో ఉపయోగం ఉండదు. ఇలా ఓ వ్యక్తి వణికే వ్యాధి ఉంది. అయినా అతడు చేసే పని అందరు మెచ్చుకునే విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. అతడి పేరు షిజి. అతడికి మొదటి నుంచి వణికే వ్యాధి ఉంది.

అప్పటి నుంచి అతడి కాళ్లు, చేతులు వణుకుతుండటంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. అయినా అతడి ధృఢసంకల్పం కింద ఆ వ్యాధి పటాపంచలైంది. అతడి చేసే కళాఖండాలతో అందని మన్ననలు పొందుతున్నాడు. ఇంతకు అతడు చేస్తున్న పనేంటంటే.. కేరళలో నివసిస్తున్న అతడు మీనియేచర్ ఆర్ట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. వివిధ రకాల వాహనాల బొమ్మలను తయారు చేస్తున్నాడు.

డబుల్ డెక్కర్ బస్సులు, వార్ ప్లేన్స్, హెలికాప్టర్స్, ఆటో రిక్షాలు లాంటివి తయారు చేస్తున్నాడు. చూడటానికి అవి నిజంగా ఫ్యాక్టరీలో తయారైన వస్తువులా కనిపించడం అతడి ప్రతిభకు నిదర్శనం. తాను తిన్నా, తాగినా చేతులు వణుకుతాయని ఆయన చెప్పుకొచ్చాడు. ఒక్కో సమయంలో తింటున్న సమయంలో అన్నం తన ముఖంపై కూడా పడేదని షిజి చెప్పుకొచ్చాడు.

అంతటి సమస్య ఉన్న అతడు ఎంత కష్టంగా బొమ్మలను తయారు చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సోదరుల దగ్గర ఈ మీనియేచర్ ఆర్ట్ నేర్చుకున్నారు. ఇదే ఇప్పుడు ఆయనకు జీవనాధారంగా మారింది. చిన్న పైపులు, చిన్న బాటిల్స్, హ్యాట్ , ప్యాకింగ్ బాక్సులు వంటి వాటితోనే షిజీ ఈ బొమ్మలను చేస్తుండటం విశేషం. ఈయన ప్రతిభను తెలుసుకున్న ప్రతీ ఒక్కరు అతడిని మెచ్చుకుంటున్నారు.