In this time Shekhar Kammula to portray Tamil hero as ‘Leader’ : దర్శకుడిగా డాలర్ డ్రీమ్స్ చిత్రం తో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల సినిమాలు చాలా వినూత్నంగా ఉంటాయి. ఈయన సినిమాల్లో పాత్రలకు బిల్డప్పులు కానీ, హింస అశ్లీలతలు సాధారణ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా తక్కువగా ఉంటాయి. ఈయన సినిమాల్లో ఎక్కువగా అందమైన ప్రేమ కథలు, బలమైన బంధాలు ఎమోషన్స్ లాంటివి కనిపిస్తాయి. శేఖర్ కమ్ముల నుంచి గత ఏడాది వచ్చిన లవ్ స్టోరీ సినిమా కూడా యువతను బాగా ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల సినిమాలు తీసే విషయం లో రూటు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక ప్రేమ కథ సినిమాగా కాకుండా ఓ విభిన్నమైన కథతో తమిళ్ హీరో ధనుష్ ఒక బై లింగ్యువల్ సినిమాని తీస్తున్నారు. అయితే ఇప్పుడే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే లాగా కనిపించట్లేదు. హీరో ధనుష్ లైన్ లో ఉన్న సినిమాలు అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే ధనుష్ సినిమా తర్వాత చేయబోతున్న మరో సినిమా కూడా తమిళ్ హీరో తోనే చేస్తున్నట్టు సమాచారం.
లీడర్ 2 సినిమా హీరో రానా కాదా…
ధనుష్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ రెడీ చేయబోతున్న సినిమా లీడర్ 2 అని సమాచారం. లీడర్ సినిమాని శేఖర్ కమ్ముల రాణా హీరోగా తీయగా అది ఇద్దరికీ ఎంతటి పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో అర్జున్ పాత్రలో రాణి తప్ప మరొకరిని ఊహించుకోలేను అంతగా ఆయన ఆ పాత్రకు జీవం పోశారు. లీడర్ ఇస్ ఈక్వల్ గా సినిమా చేయబోతున్నట్టు ఇంతకుముందు వార్తలు వినిపించిన అరణ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా శేఖర్ కమ్ముల ఇదే ప్రస్తావించారు. అయితే భీమ్లా నాయక్ ప్రమోషన్లలో రానా ఈ విషయమై శేఖర్ కమ్ముల గారు ఒక్కటి రెండు సీన్లు చెబుతారు తర్వాత కనిపించరు అని పేర్కొన్నారు.
అయితే తాజాగా లీడర్ 2 సినిమా కోసం శేఖర్ కమ్ములహీరో సూర్య అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎంతో కాలంగా శేఖర్కమ్ముల సూర్యా హీరోగా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని చూస్తున్నారట, రాజకీయ నేపథ్యంలో సాగే ఈ కథను సూర్యాకు వినిపించగా వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. అర్జున్ పాత్రలో రానా ను హీరో సూర్య రీప్లేస్ చేయగలుగుతాడో లేదో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…