Inaya Sultana: ఇనయా సుల్తానా పరిచయం అవసరం లేని పేరు. రాంగోపాల్ వర్మ ద్వారా ఫేమస్ అయిన వారిలో ఈమె కూడా ఒకరు.రాంగోపాల్ వర్మతో కలిసి చేసిన ఒక డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయారు. ఇలా పలు సినిమాలలో నటించిన రానీ గుర్తింపు వర్మ డాన్స్ వీడియోతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇకపోతే ఈమెకు ఉన్న పాపులారిటీతో ఈమె బిగ్ బాస్ సీజన్ 6 అవకాశాన్ని అందుకున్నారు. చివరి వరకు ప్రతి ఒక్క టాస్క్ లో గట్టి పోటీ ఇస్తూ స్ట్రాంగ్ కంటెంట్ గా ఉన్నటువంటి ఈమె 14వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి ఇనయా ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కెరియర్ మొదట్లో ఓ సినిమా ఆడిషన్స్ కోసం తాను వెళ్లానని అయితే అక్కడ ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో వారి వ్యవహార శైలి తనకు ఎన్నో అనుమానాలను కలిగించిందని తెలిపారు. ఇక నిర్మాతకు సంబంధించిన కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరుతో తాను మీరు కమిట్మెంట్ ఇస్తేనే అవకాశం ఇస్తారా అని డైరెక్ట్ గా అడిగానని తెలిపారు. అందుకు వాళ్లు అవునని సమాధానం చెప్పడంతో నేను ఆ అవకాశాన్ని వదులుకొని వచ్చేసానని ఇనయా తెలిపారు.
ఇదే విధంగా మరొక సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లగా అక్కడ కూడా తనకు ఇలాంటి అనుభవమే ఎదురయిందని ఈమె తెలియజేశారు. ఇక సినిమా అవకాశాల కోసం వెళ్లగా బెడ్ రూమ్ లోకి వస్తేనే తనకు ఆఫర్ ఇస్తామంటూ చెప్పడంతో తాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసానని తెలిపారు. తనపై నమ్మకంతో నిజాయితీతో అవకాశం వస్తే నటిస్తాను కానీ ఇలా అడ్డదారులు తొక్కి నటించాల్సిన అవసరం తనకు లేదని ఈ సందర్భంగా సినిమా అవకాశాలను కోల్పోవడానికి కారణాలు తెలిపారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…