నేరేడు పండు.. పోషకాలు మెండు.. ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

నేరేడు పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇది సీజనల్ లో మాత్రమే దొరుకుతుంది. ఇవి రుచికి తియ్యగా ఉండవు. అలా అని వగురుగా ఉండవు. అందుకని చాలామంది ఎక్కువగా ఇష్టపడతారు. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి.

నేరేడుపండ్లు శక్తిని అందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. అందుకే ఈ పండ్లను ఆరోగ్య ఫలప్రధాయిని అని పిలుస్తుంటారు. ముఖ్యంగా శరీరానికి ఎంతో అవరసమైన విటమిన్ సి ఇందులో అధికంగా లభిస్తుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా ఈ ఫ్రూట్ సాయపడుతుంది.

దీనిలో ఐరన్ కూడా కూడా ఉంటుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. యూరిన్ సమస్య కూడా తగ్గిపోతుంది. నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. ఇక మధుమేహం ఉన్నవారికి అయితే నేరేడు పండు చేసే మేలు అంతా, ఇంతా కాదు. దీనిని రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం క్రమబద్ధమవుతుంది. నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది .

అనారోగ్యకరమైన ఆహారం తీసుకొనే వారిలో కొన్ని పోషకాహారాల లోపం వల్ల గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురంగు నేరేడు పండ్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వృద్దాప్యము ఆలస్యం చేస్తుంది.