అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా
రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం “ఊహలు గుసగుసలాడే”.ఈ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ నటి ఆ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ సందడి చేశారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో ఈమెకు అవకాశాలు తక్కువైనప్పటికీ తమిళంలో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో రాశీ ఖన్నా నాగచైతన్య సరసన “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ సందర్భంలో రాశీ ఖన్నా మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఏవిధంగా ఉండాలనే విషయాలను గురించి వెల్లడించారు. ఎప్పుడు ఓకే పంథాలో కొనసాగాలంటే ఇండస్ట్రీలో కుదరదు.. ఇండస్ట్రీలో అనుభవం పెరిగే కొద్దీ కొత్త కొత్త మార్గాలను అన్వేషించాలని ఈ బ్యూటీ చెబుతోంది. కెరియర్ మొదట్లో ప్రతి ఒక్క హీరోయిన్ గ్లామరస్ పాత్రల ద్వారా లేదా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అయితే ఎప్పుడు ఇలాగే ఇండస్ట్రీలో కొనసాగుతున్న అంటే కుదరదు.
ఇండస్ట్రీలో ఓ దశకు వచ్చాక కచ్చితంగా వేర్వేరు దారులలో ప్రయాణించాల్సి ఉంటుంది.ఈ విధంగా నటనా ప్రాధాన్యత గ్లామరస్ పాత్రలను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే ఇండస్ట్రీలో కొంత కాలం పాటు నిలవగలము ఎప్పుడైతే మనలో విభిన్నమైన ప్రత్యేకతలు ఉంటాయో అప్పుడే మనకు అవకాశాలు కూడా వస్తాయని ఎప్పుడు కమర్షియల్ చిత్రాలలోనే నటిస్తానంటే అస్సలు కుదరదంటూ ఈ సందర్భంగా
రాశీ ఖన్నా తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…