Categories: FeaturedMovie News

Indhu Anandh : 46 ఏళ్లుగా భరించాను… నా కూతురు నా కళ్ల ముందు చనిపోవాలి : ఇందు ఆనంద్

Indhu Anandh : తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు సినిమాలు ఇటు సీరియల్స్ లో నటిస్తున్న నటి ఇందు ఆనంద్. చక్రవాకం, మొగలిరేకులు, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్ తో బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇందు ఆనంద్ సినిమాల్లోనూ చేసిన కొన్ని వాటిలోనే గుర్తింపు ఉన్న పాత్రలను ఎంచుకున్నారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి పాత్రలను చేసిన ఇందు ప్రస్తుతం గమనం, బుడుగు వంటి చిత్రాల్లో నటించారు. రెమ్యూనరేషన్ గురించి ఏరోజూ డిమాండ్ చేయలేదని, ఒక సంస్థతో పనిచేసాక మళ్ళీ అదే సంస్థ తో పనిచేయడానికి ఇష్టపడుతానని, ‘కళ్యాణ వైభోగమే’ టీం తో నాలుగున్నరేళ్లు పని చేశాను మళ్ళీ వాళ్ళతోనే ‘కళ్యాణం కమనీయం’ లో చేస్తున్నాను అలాగని ఎక్కువ పారితోషకం ఇవ్వమని అడగలేదు అని చెప్పారు ఇందు.

నా కూతురు నా కన్నా ముందే చనిపోవాలి…

వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఇందు ఆనంద్ తన కూతురు గురించి చెప్పారు. తాను మూడు పెద్ద సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చిందని కానీ ఈ వయసులో కూడా కష్టపడుతూ పనిచేయడానికి కారణం కూతురు ని రాయల్ గా చూసుకోవడం కోసమే అని ఇందు చెప్పారు. తాను పుట్టినప్పటి నుండి ఇప్పటివరకూ తనకు ఏ లోటు లేకుండా పెంచానని అందుకే తనకోసం ఈ వయసులోనూ కస్టపడుతున్నట్లు చెప్పారు. ఇందు కుమార్తె కు మానసిక ఎదుగుదల, ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల చిన్నపిల్ల గానే ఉండిపోయారు.

అందుకే తన కూతురిని పెంచడం ఎప్పుడూ భారంగా, బాధగా అనుకోలేదని శాశ్వతంగా ఒక చిన్నపాపను నేను సాకుతున్నానని ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఇక నాకు ఏదైనా కోరిక్ ఉంది అంటే అది నా కూతురు నేను బ్రతికుండగానే చనిపోవాలి అని కోరుకుంటాను అంటూ ఎవరూ బహుశా ఇలా కోరుకోరు కానీ ఇంకొకరికి నా కూతురు ని పెంచడం భారం కాకూడదని అలా అనుకుంటున్నాను. నా భర్త చనిపోయాక నా బిడ్డను అన్నీ నేనే అయి పెంచాను. ఇప్పటికీ తన కోసం కస్టపడుతున్నాను. కానీ నా తరువాత తనను చూసుకోవడానికి మరొకరు ఇబ్బంది పడకూడదు అంటూ చెప్పారు ఇందు ఆనంద్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago